సెప్టెంబర్ 23 న బెడ్ లైట్ సినిమా విడుదల












సెప్టెంబర్ 23 న బెడ్ లైట్ సినిమా విడుదల

నాధా ధీనం జగత్ సర్వం ప్రొడక్షన్స్ పతాకంపై జాంజ్ సూర్య నారాయణ సమర్పణలో జామి ప్రసాద్ నటిస్తూ దర్శకత్వం చేసిన సినిమా ' బెడ్ లైట్ ' వెలిగిందో డేంజర్ అనేది ఉప శీర్షిక.




హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా హీరో , డైరెక్టర్ జామి ప్రసాద్ మాట్లాడుతూ
చాలా కష్ట పడి మా టీం ఈ సినిమా ని తీసాము ,వైజాగ్ , విజయనగరం ప్రాంతాలలోని లొకేషన్స్ లో సినిమా ని షూట్ చేసాం, సెన్సార్ బోర్డ్ మెంబర్స్ సైతం సినిమా చూసి ప్రశంసించారు.

మా సినిమా ని థియేటర్లలో విడుదల చేయడానికి సహకారాన్ని అందిస్తున్న డిస్ట్రిబ్యూటర్ కొప్పిశెట్టి శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.


అలానే ఈ సినిమా కి మరొక ప్రత్యేకత ఏంటి అంటే
కథ మాటలు, కెమెరా, ఎడిటింగ్ నుండి సర్వం నేనె చేసాను, 24 క్రాఫ్ట్స్ ని భుజాన వేసుకొని చాలా ఇష్టం తో తీసిన ఈ సినిమా ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. 
నటి నటులు
జామి ప్రసాద్, వాగ్దేవి, కీర్తన, ఏ.యు. ప్రసాద్ సుబ్బారావు, అకిరా ప్రీత్, శ్రీజ తదితరులు.


Post a Comment

0 Comments