*శంకర ఐ హాస్పిటల్స్, ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యులకు ఫ్రీ ఐ హెల్త్ చెకప్*






శంకర ఐ హాస్పిటల్స్, ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యులందరికీ ఫ్రీ ఐ హెల్త్ చెకప్‌ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు విష్ణు మంచు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ పాల్గొన్నారు. ఈ ఫ్రీ ఐ హెల్త్ క్యాంప్‌లో మా సభ్యులందరూ పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మీడియాతో..

 *విష్ణు మంచు మాట్లాడుతూ..* ‘హెల్త్ క్యాంప్ నిర్వహించిన శంకర ఐ హాస్పిటల్స్, ఫినిక్స్ ఫౌండేషన్‌లకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాల్గోని సద్వినియోగం చేసుకుని విజయవంతం చేసిన మా సభ్యులకు అభినందనలు.  పద్మశ్రీ డా. రమణి గారు గురించి మేం విన్నాం. భారతదేశం అంతా కూడా ఫ్రీగా ఐ హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు. కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదని అంటుంటారు. ఫీనిక్స్ సంస్థ, శంకర హాస్పిటల్స్ కూడా అదే చేస్తోంది. కంచి కామ కోటి మఠ పీఠాదిపతుల్ని మేం ఆరాధిస్తుంటాం. వాళ్ల ఆశీస్సులతో ఈ హాస్పిటల్స్ నడుస్తుండటం ఆనందంగా ఉంది. ’ అని అన్నారు. 

 *మాదాల రవి మాట్లాడుతూ..* ‘ఫినిక్స్ సంస్థ నుంచి చుక్కపల్లి సురేష్ గారు, చుక్కపల్లి అవినాష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. శంకర ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ ఐ హెల్త్ క్యాంప్‌ను నిర్వహించడం ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన ఫీనిక్స్ సంస్థ నీలేష్ జానీ గారికి థాంక్స్. మా సభ్యులందరికీ ఫ్రీ చెకప్ చేసిన శంకర ఐ హాస్పిటల్ హెడ్ విశ్వ మోహన్ గారికి కృతజ్ఞతలు’ అని అన్నారు.

 *శివ బాలాజి మాట్లాడుతూ..* ‘అందరూ కంటి సమస్యల గురించి పట్టించుకోరు.  ఇలా మా సభ్యులందరికీ ఫ్రీ ఐ హెల్త్ చెకప్ చేయించడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు 25 లక్షల మందికి ఫ్రీ ఆపరేషన్స్ చేయించారని తెలిసింది. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మేం అంతా కలిసి మీకు ఫ్రీగా ప్రచారం చేస్తామ’ని అన్నారు.

 *ఫీనిక్స్ సంస్థ డైరెక్టర్ నీలేష్ జానీ మాట్లాడుతూ..* ‘మేం సాధ్యమైనంత వరకు బ్లైండ్ నెస్‌ను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాం. ‘మా’తో అసోసియేట్ అవ్వడం వల్ల మేం మరింతగా జనాలకు రీచ్ అవుతామని అనుకుంటున్నామ’ని అన్నారు.

 *శంకర హాస్పిటల్ హెడ్ విశ్వ మోహన్ మాట్లాడుతూ..* ‘సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ముందుగానే గుర్తించి కంటి సమస్యలను తొలగించుకోవాలి. మా సభ్యులతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

Post a Comment

0 Comments