"క" సినిమాలో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు,ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం ,

"క" సినిమాలో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు, స్ట్రాంగ్ కంటెంట్, యూనిక్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది - ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం






యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా "క" ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ‌"క" సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో


ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ - ‌"క" సినిమా ట్రైలర్ మీకు నచ్చిందని నమ్ముతున్నాం. ట్రైలర్ ఎంత బాగుందో సినిమా అంతకంటే చాలా బాగుంటుంది. ‌"క" సినిమాను బెటర్ క్వాలిటీతో తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సకుటుంబంగా మీరంతా వచ్చి థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. తప్పకుండా ఈ నెల 31న మా ‌"క" సినిమాను థియేటర్స్ లో చూడండి. చూసి మీ రెస్పాన్స్ చెబుతారని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ - ‌"క" సినిమా ట్రైలర్ మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నా. సినిమా దీనికి నాలుగు రెట్ల పవర్ ఫుల్ గా ఉంటుంది. కిరణ్ గారిని ఇప్పటిదాకా చూడని విధంగా సరికొత్తగా ‌"క" మూవీలో చూపించబోతున్నాం. ఈ నెల 31న థియేటర్స్ లో ‌"క" సినిమా చూడండి. మీ అందరినీ మూవీ బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఎక్కడా అసంతృప్తిగా ఫీల్ కారు. ఒక మంచి మూవీ చూశామనే ఫీలింగ్ తో థియేటర్ నుంచి బయటకు వస్తారని మాటిస్తున్నా. అన్నారు.


హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ - ‌"క" మూవీలో నేను సత్యభామ అనే బ్యూటిఫుల్ రోల్ చేస్తున్నాను. మీ అందరికీ నా క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. ‌"క" ట్రైలర్ లో మీరు చూసింది 5 పర్సెంట్ మాత్రమే. మా సినిమాలో ఎన్నో ట్విస్ట్స్ టర్న్స్ ఉన్నాయి. అవన్నీ మీకు ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తాయి. ఈ నెల 31న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి థియేటర్స్ కు వెళ్లి ‌"క" సినిమా చూడండి. అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ మాచర్ల మాట్లాడుతూ - ‌"క" సినిమా ట్రైలర్ ఎలా అనిపించింది. మీకు బాగా నచ్చే ఉంటుంది. మా సినిమా సక్సెస్ మీట్ విజయవాడలోనే నిర్వహించాలని అనుకుంటున్నాం. మీరంతా మా మూవీని చూసి సపోర్ట్ చేయాలి. అన్నారు.


హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - ఈ రోజు మా ‌"క" సినిమా ట్రైలర్ రిలీజ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. చాలా టైమ్ మీతో స్పెండ్ చేసే అవకాశం కలిగింది. నా ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్ తోనే నేను ఈ స్టేజీ మీద ఉన్నాను. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసే సినిమాలు మరిన్ని చేస్తాను. నేను చాలా మొండివాడిని. ఇబ్బందులు వచ్చినా మంచి సినిమాలు చేయాలనే నా ప్రయత్నం ఆపను. కిరణ్ అబ్బవరం పని అయిపోయింది అన్నవాళ్లతోనే బాగా చేశాడు అనిపించుకుంటా. చాలా కొత్త కంటెంట్ తో ‌"క" సినిమా చేశాను. గతంలో నా సినిమాలు అన్ని విషయాల్లో బాగున్నా కంటెంట్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది అనే కామెంట్స్ వచ్చాయి. అందుకే కంటెంట్ మీద శ్రద్ధ తీసుకుని ‌"క" సినిమా చేశాం. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా కొత్తగా ప్రయత్నించాం. స్క్రీన్ ప్లే యూనిక్ గా ఉంటుంది. ‌"క"లో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు. వాసుదేవ్ ప్రపంచంలోకి వెళ్లి కథకు మీరు బాగా కనెక్ట్ అవుతారు. సినిమా చూస్తున్నంత సేపూ హ్యాపీగా ఫీలవుతారు. నా సినిమాలు ఎలా ఉన్నా మీరు నాతో మొహమాటం లేకుండా చెప్పవచ్చు. మీ సజెషన్స్ తీసుకుని బెటర్ గా ప్రయత్నించిన చిత్రమే ‌"క". నా కోసమైనా థియేటర్ కు వెళ్లి ‌"క" సినిమా చూడండి. నా సినిమాలు బాగా లేదు అని గతంలో చెప్పి వాళ్లే ఫస్ట్ డే ‌"క" సినిమా చూడాలని కోరుకుంటున్నా. మా సినిమాలో సీజీ వర్క్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. మంచి క్వాలిటీతో ఆ వర్క్ చేసేందుకు మా డైరెక్టర్ సందీప్ ఈ ఈవెంట్ కు రాలేకపోయారు. మ్యూజిక్ చేసిన సామ్ సీఎస్ గారికి థ్యాంక్స్. మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‌"క" సినిమా ఇంత బాగా రావడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు. ఆయన నాకు మా టీమ్ కు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. మనం మంచి సినిమా చేశామంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు నేనుప్రామిస్ చేస్తున్నా దీపావళి పండుగకు మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్ కు వెళ్లండి, ‌"క" సినిమా చూడండి. మిమ్మల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

"క" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే.... చుట్టూ కొండల మధ్య ఉన్న కృష్ణగిరి అనే అందమైన ఊరిలో పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తుంటాడు అభినయ వాసుదేవ్. మధ్యాహ్నమే చీకటి పడే ఆ ఊరు భౌగోళికంగా ఎంతో ప్రత్యేకం. అక్కడ సత్యభామ అనే అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు వాసుదేవ్. ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్ ను బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది ?, వాసుదేవ్ ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? అనే అంశాలు ఆసక్తిని కలిగించాయి. ట్రైలర్ చివరలో 'జాతర మొదలుపెడదామా..' అంటూ ముసుగు వ్యక్తిగా వాసుదేవ్ రావడం సర్ ప్రైజ్ ట్విస్ట్ ఇచ్చింది. గ్రిప్పింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా "క" సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. ట్రైలర్ లో హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఆకట్టుకున్నాయి.


నటీనటులు - కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ - శ్రీ వరప్రసాద్
డీవోపీస్ - విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ - సామ్ సీఎస్
ప్రొడక్షన్ డిజైనర్ - సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - చవాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - రితికేష్ గోరక్
లైన్ ప్రొడ్యూసర్ - కేఎల్ మదన్
సీయీవో - రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)
కాస్ట్యూమ్స్ - అనూష పుంజ్ల
మేకప్ - కొవ్వాడ రామకృష్ణ
ఫైట్స్ - రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ - పొలాకి విజయ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - ఫణిరాజా కస్తూరి
కో ప్రొడ్యూసర్స్ - చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
ప్రొడ్యూసర్ - చింతా గోపాలకృష్ణ రెడ్డి
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
రచన దర్శకత్వం - సుజీత్, సందీప్

Post a Comment

0 Comments