కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో జి శంకర్, ఎల్ మధు నిర్మాతలుగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం ఉద్వేగం. ఈ చిత్రానికి అజయ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించారు. త్రిగున్ ముఖ్యపాత్రలో నటించినున్న ఈ చిత్రంలో దీప్సిక కథానాయికగా నటించగా శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఈ చిత్రం టీజర్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి చేతుల మీదగా విడుదల కావడం జరిగింది. చిత్రం టీజర్ చూస్తుంటే ఎంతో కష్టపడి తీశారని, అలాగే యాక్టర్ త్రిగున్ కు 25వ చిత్రం కావడం విశేషమని ఆర్జీవి అన్నారు. అంతేకాక కోర్టు రూములో వచ్చే చిత్రాలు చాల తక్కువ అని, ఈ చిత్రం మంచి సక్సెస్ కావాలని తన కోరుకుంటున్నట్లు ఆర్జీవి అన్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ఏంతో ప్రేక్షక ఆదరణ పొందింది.
2021లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత కోర్టు నేపథ్యంలో మరో సినిమా ఇదే కావడం విశేషం. ఈ నెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది అని చిత్ర బృందం వెల్లడించింది.
చిత్రం: ఉద్వేగం
నటీనటులు: త్రిగున్, దీప్సిక, శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, అంజలి తదితరులు
సంగీతం: కార్తిక్ కొడగండ్ల
సినిమాటోగ్రఫీ: అజయ్
ఎడిటర్: జశ్వీన్ ప్రభు
పీఆర్ఓ: హరీష్, దినేష్
నిర్మాతలు: జి శంకర్, ఎల్ మధు
దర్శకుడు: మహిపాల్ రెడ్డి
0 Comments