సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఆరోసారి ఛైర్మన్ గా ఎన్నికైన రామకృష్ణ గౌడ్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ అసోసియేషన్ ద్వారా వారు ఎంతోమందికి సపోర్ట్ అందిస్తున్నారు. నాకు సినిమాలంటే ఇష్టం. అయితే చిత్ర పరిశ్రమ ఎవరో ఐదారుగురు పెద్ద వారిదే కాదు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో సినిమా పట్ల ఆసక్తి ఉన్న అందరిదీ. అందరికీ నటన రాదు. వచ్చిన కళాకారులకు మనం సపోర్ట్ గా నిలబడాలి. మా భూమి నుంచి మొన్నటి బలగం వరకు తెలంగాణ వాళ్లు ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. తెలంగాణలో సినిమా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ సంకల్పం. నా దగ్గరకు థియేటర్స్ ఇప్పించమని వచ్చే ప్రతి చిన్న సినిమా వారికి నా సహకారం అందిస్తున్నా. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు 800 గజాల స్థలం ఇప్పించేందుకు ప్రభుత్వం తరుపున ప్రయత్నం చేస్తాం. అలాగే చిత్రపురి కాలనీలో కొత్తగా కట్టబోయే ఫ్లాట్స్ లో మన తెలంగాణ సినిమా వారికి ఫ్లాట్స్ ఇప్పిస్తాం. మీకు ఏ సహకారం కావాలన్నా ప్రభుత్వం తరుపున గానీ, వ్యక్తిగతంగా నా తరుపున గానీ చేస్తానని హామీ ఇస్తున్నా అన్నారు

Post a Comment

0 Comments