యముడు ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన నిర్మాత రాజ్ కందుకూరి





జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరో గా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం "యముడు". ధర్మో రక్షతి రక్షిత అనే ఉప శీర్షిక తో వస్తున్నా థ్రిల్లర్ చిత్రం షూటింగ్ అంత పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మాసం లో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో శ్రావణి శెట్టి హీరోయిన్ గా నటించింది మరియు ఆకాష్ చల్లా రెండో హీరో గా నటించాడు.

 అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈరోజు ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ విడుదల అనంతరం నిర్మాత రాజ్ కందుకూరి గారు మాట్లాడుతూ "యముడు చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కథ విన్నాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మంచి కథ, ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రోజుల్లో ప్రేక్షకులు చిన్న సినిమా, కొత్త సినిమా అని చూడటం లేదు. కథ బాగుంటే సూపర్ హిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జగదీష్ ఆమంచి బాగా చేసుంటారు అని నమ్ముతున్నాను. మంచి హిట్ కావాలి" అని కోరుకున్నారు.  

హీరో, దర్శకుడు నిర్మాత జగదీష్ ఆమంచి మాట్లాడుతూ "మా యముడు చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు. మా చిత్ర కథ విషయానికి వస్తే సామాన్య ధర్మం పాటించకుండా సమాజానికి కీడు చేసే వాళ్ళకి యముడు ప్రత్యక్షమై గరుడ పురాణం ప్రకారం శిక్షలు వేస్తుంటాడు. యముడు ఎందుకు ఆలా చేస్తాడు చివరికి ఏమవుతుంది అనేదే చిత్ర కథ. 2005 లో శంకర్ గారి దర్శకత్వం లో హీరో విక్రమ్ గారు నటించిన అపరిచితుడు చిత్రం లగే అదే కాన్సెప్ట్ లో మా చిత్రం కూడా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులందరికీ మా యముడు చిత్రం నచ్చుతుంది" అని తెలిపారు.

 

చిత్రం పేరు : యముడు

బ్యానర్ : జగన్నాధ పిక్చర్స్

నటి నటులు : జగదీష్ ఆమంచి, శ్రావణి శెట్టి, ఆకాశ్ చల్లా, అనిత రాజ్, తదితరులు

పోస్ట్ ప్రొడక్షన్ : అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్

యాక్షన్ : రామ్ సుంకర

డాన్స్ మాస్టర్ : రాజ్ పైడి

డిఓపి : విష్ణు రెడ్డి వంగా

సంగీతం : భవాని రాకేష్

రైటర్ : హరి అల్లసాని, జగదీష్ ఆమంచి

స్క్రీన్ ప్లే : శివ కూండ్రపు

ఎడిటర్ : కృష్ణ

డిజిటల్ పిఆర్ఓ : వంశీ కృష్ణ (సినీ డిజిటల్)

పిఆర్ఓ : పాల్ పవన్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రజిని ఆమంచి

కథ, దర్శకుడు, నిర్మాత : జగదీష్ ఆమంచి

Post a Comment

0 Comments