పుష్ప 2 సెన్సార్ పూర్తి



పుష్ప 2 సెన్సార్ పూర్తి. మూడు బీప్స్ తో U/A స‌ర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డ్. సినిమా నిడివి 3 గంట‌ల 20 నిమిషాలు. జ‌పాన్ ఎపిసోడ్ తో సినిమా మొద‌లు. జాత‌ర ఎపిసోడ్ 25 నిమిషాల జాత‌ర ఎపిసోడ్ తోనే పైసా వ‌సూల్. మాస్ అప్పీల్ తో సాగిన‌ క్లైమాక్స్ ఫైట్‌. కాళ్లూ చేతులూ క‌ట్టేసినా హీరో చేసే విధ్వంసం క‌ళ్లారా చూడాల్సిందే. పార్ట్ 3 ఉంద‌ని చెప్పారు కానీ, గ్లింప్స్ లాంటివేం లేవు. పుష్ప - శ్రీ‌వ‌ల్లి మ‌ధ్య ఎమోష‌న్... కుటుంబ ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మొత్తంగా చూస్తే పుష్ప 1ని మించిన విజ‌యాన్ని పుష్ప 2 సాధిస్తుంద‌న్న అంచ‌నాలు క‌నిపిస్తున్నాయి. పుష్ప టీమ్‌కు ముంద‌స్తు శుభాకాంక్ష‌లు #pushpa2TheRule #AlluArjun

Post a Comment

0 Comments