హిప్పీ


 `హిప్పీ`
`ఆర్‌.ఎక్స్.100`​...... ​ చిన్న సినిమాల్లో పెద్ద సంచ‌ల‌నం. ఇటీవ‌లి కాలంలో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన చిత్రం. తొలి చిత్రంతోనే యూత్ ఐకాన్ అనే గుర్తింపు తెచ్చుకున్నారు​ హీరో ​ కార్తికేయ‌. మూవీ ల‌వ‌ర్స్ కీ, సినీ గోయ‌ర్స్ కీ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు క‌లైపులి.య‌స్‌.థాను. అభిరుచి గ‌ల, భారీ బ‌డ్జెట్‌ నిర్మాత‌గా ఆయ‌న‌ది ప్ర‌త్యేక‌మైన స్థానం. తెలుగువారికి ఎంతో ప‌రిచ‌యమున్న `కాక్క కాక్క‌`, `కంద‌సామి`, `తుపాకి`, `అరిమా నంబి`, `క‌నిద‌న్‌`, `తెరి`, `క‌బాలి`, `వేలై ఇల్లా ప‌ట్ట‌దారి2`, `స్కెచ్‌`.. ఇవ‌న్నీ ఆయ‌న నిర్మించిన చిత్రాలే. 1985 నుంచి సినిమా నిర్మాణంలో త‌న‌దైన ముద్ర వేసుకుని నిర్మాత‌గా, ప్ర‌ముఖ పంపిణీదారుడిగా త‌మిళ‌నాట కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం కార్తికేయ హీరోగా ఆయ‌న ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి క్రియేష‌న్స్ ​, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి . కార్తికేయ హీరోగా న‌టిస్తున్నారు. టి.ఎన్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు.ఆ సినిమాకు `హిప్పీ` అనే టైటిల్ పెట్టారు. శుక్ర‌వారం కార్తికేయ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని `హిప్పీ` టైటిల్‌ను ప్ర‌క‌టించారు. ఈ చిత్రం గురించి...
ద‌ర్శ‌కుడు టి.ఎన్‌.కృష్ణ మాట్లాడుతూ ``రొమాంటిక్ కామెడీ చిత్ర‌మిది. కార్తికేయ త‌న తొలి చిత్రానికి భిన్నంగా క‌నిపిస్తారు. కేర్‌ఫ్రీ, కేజువ‌ల్‌గా సాగే పాత్ర‌లో ఆయ‌న న‌టిస్తారు. చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లుంటారు. వాళ్ల‌ని ఇంకా ఫైన‌ల్ చేయాలి. సినిమా ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగుతుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టే సినిమా. మ‌న జీవితంలో నిత్యం జ‌రిగే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. అక్టోబ‌ర్ నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ ఉంటుంది.​'​సిల్లును ఒరు కాదల్ ​'​​(​`నువ్వునేను ప్రేమ‌`​గా తెలుగులో అనువాదమైంది )​, `నెడుంజాలై` ​, ​​తర్వాత నేను డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది​​`` అని అన్నారు.
నిర్మాత క‌లైపులి.య‌స్‌.థాను​ ​మాట్లాడుతూ ``త‌మిళంలో 1985 నుంచి వ‌రుస‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కిస్తున్నాం. అటు పంపిణీరంగంలోనూ మాదైన ముద్ర‌తో కొన‌సాగుతున్నాం. తెలుగులో నేరుగా సినిమా తీయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాం. అది ఇప్ప‌టికి కుదిరింది. కార్తికేయ `ఆర్‌.ఎక్స్.100` చూశాను. ప్రెజెంట్ ట్రెండ్‌కి త‌గ్గ హీరో అనిపించింది. ఆయ‌న‌తో `హిప్పీ` అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. ఎక్క‌డా బ‌డ్జెట్‌కు వెన‌కాడ‌కుండా, సినిమాకు కావాల్సిన‌దంతా స‌మ‌కూర్చి భారీగా రూపొందిస్తాం`` అని అన్నారు.
హీరో కార్తికేయ​ ​మాట్లాడుతూ ``ఆర్ ఎక్స్ 100 త‌ర్వాత ఓ పెద్ద సంస్థ‌లో అవ‌కాశం రావ‌డం నా అదృష్టం. క‌థ చాలా బావుంది. నిత్యం మ‌న జీవితంలో జ‌రిగే అంశాల‌ను తెరపై చూడొచ్చు. తొలి సినిమా ఇచ్చిన స‌క్సెస్‌ను కంటిన్యూ చేసే సినిమా అవుతుంది`` అని అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.డి. రాజ‌శేఖ‌ర్, సంగీతం: నివాస్ కె.ప్ర‌స‌న్న, ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ కె.ఎల్‌, స్టంట్‌: దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌.

Post a Comment

0 Comments