Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

May 22, 2020

మూడు తరాల మల్టీస్టారర్ సినిమా మనం

తన సొంత పతాకమైన అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన మల్టీస్టారర్ సినిమా మనం. అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన ఈ అరుదైన చిత్రంలో శ్రియా, సమంత కథానాయికలుగా నటించారు.మనం సినిమా బ్యాక్ టు ఫ్యూచర్ అనే ఇంగ్లీష్ సినిమా యొక్క స్పూర్థి.తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున తన కలల ప్రాజెక్ట్.

మనం సినిమా మార్కెటింగ్ విషయంలో మోషన్ పోస్టర్ అనే ఒక సరికొత్త పద్ధతిని అవలంభించింది. ఈ మోషన్ పోస్టర్ ని Rev Eye అనే ఒక Augmented Reality అప్ప్లికేషన్ ద్వారా తయారు చేసారు. దీనిని వాడుకరి ఒక సారి తన స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేస్తే చాలు, ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు వీడియో రూపంలో ప్లే అవడమే కాకుండా అవి తన తోటి వారితో సోషల్ నెట్వర్క్ లో షేర్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.

No comments:

Post a Comment