నా తల్లిదండ్రులు పెట్టిన పేరు భక్తవత్సలం. నటుడిగా నాకు జన్మ ప్రసాదించిన గురువుగారు దాసరి నారాయణ రావు గారు, మోహన్ బాబు అని నామకరణం చేశారు1975. నన్ను ఒక విలన్ గా, ఒక కమెడియన్ గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఒక హీరోగా అన్ని రకాల పాత్రలు నాకిచ్చి...నన్ను ఇంతటి వ్యక్తిని చేసిన ఆ మహనీయుడు, తండ్రి లాంటి తండ్రి దాసరి నారాయణరావు గారి పుట్టిన రోజు మే 4న అంటే ఈరోజు. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, గురువుగారి ఆశీస్సులు మా కుటుంబానికి ఉంటాయని నేను కోరుకుంటున్నాను.మోహన్ బాబు
0 Comments