కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి
కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి
బాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ (42) ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం ఆయా వర్గాలను కలవరపెడుతోంది. వరుస మరణాలతో సినీ పరిశ్రమను విషాద ఛాయలు వెంటాడుతున్నాయి. మే 31వ తేదీ (ఆదివారం) రాత్రి ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ (42) కన్నుమూశారు. కొన్నాళ్లుగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇటీవలే కరోనా కూడా సోకడంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు
0 Comments