లాస్ట్ షెడ్యూల్ జ‌రుపుకోనున్న గోపీచంద్ `సీటీమార్`.

లాస్ట్ షెడ్యూల్ జ‌రుపుకోనున్న  గోపీచంద్ `సీటీమార్`.

 గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరినిర్మిస్తున్న చిత్రం `సీటీమార్‌`.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో నిర్మించ‌బ‌డుతున్నఈ  సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ‌మిగిలిన భాగాన్ని ఆగ‌స్ట్ మొద‌టివారం నుండి షూటింగ్ మొద‌లుపెట్టి ఒకే షెడ్యూల్‌లో సినిమాని కంప్లీట్ చేయ‌డానికి చిత్ర యూనిట్ సిద్ద‌మ‌వుతుంది. ఎంత‌గానో ఎదురు చూస్తున్న గోపిచంద్ అభిమానుల‌కోసం వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్ష‌కుల‌ముందుకు తీసుకొస్తాం అని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు. జూన్ 12 ఎగ్రెసివ్ స్టార్ గోపిచంద్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా `సీటీమార్` టీమ్ శుభాకాంక్ష‌లు తెలిపి న్యూ స్టిల్ విడుద‌ల చేసింది.

ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్ గా గోపిచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా త‌మ‌న్నా న‌టిస్తున్నారు. విలేజ్ లో ఉండి హీరోని ప్రేమించే ఒక ప్ర‌త్యేక పాత్ర‌లో మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా చాలా ముఖ్య‌మైన పాత్ర‌ల్లో పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.
మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యంలో ఒక పాట మిన‌హా ఇప్ప‌టికే నాలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ పాట‌లు రికార్డ్ చేయ‌డం జ‌రిగింది. మాస్ ప్రేక్ష‌కుల కోసం ఒక మాస్ ఐటెం సాంగ్‌ని కంపోజ్ చేస్తున్నారు మ‌ణిశ‌ర్మ‌. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌పి ప్రేక్ష‌కుల‌కు ఐ ఫీస్ట్ లా ఉండ‌బోతుంది.
ఈ చిత్రానికి
డిఓపి: సౌందర్‌ రాజన్‌,
సంగీతం: మణిశర్మ‌,
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,
ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై,
పి.ఆర్‌.ఓ: బి.ఎ.రాజు,
సమర్పణ: పవన్‌ కుమార్‌,
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి,
కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.

Post a Comment

0 Comments