ఇళయరాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు
ఇళయరాజా తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.
జనాలకు ఈయన "మేస్ట్రో " అని సుపరిచితం.
తమిళనాడు రాష్ట్రంలో, తేని జిల్లాలో పన్నైపురమ్ అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో రామస్వామి, చిన్నాతాయమ్మాళ్ దంపతులకు మూడవ కుమారునిగా ఇళయరాజా జన్మించారు. వ్యవసాయక ప్రాంతంలో పెరగటం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం కలిగింది. అతనిలోని సంగీత జ్ఞానం, అతని 14వ ఏట బయటపడింది. ఆ వయసులో ఇళయరాజా తన సవతి అన్న (పావలార్ వరదరాజన్, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రచారక బృందంలో సంగీతకారుడు) నిర్వహించే సంగీత బృందంతో కలసి ఉరూరా తిరిగేవాడు. అతను తన సోదరులతో కలసి దక్షిణ భారతదేశంలోని చాలా గ్రామాలు, పట్టణాల్లో పావలార్ సంగీత సోదరులు అనే బృందంలో సభ్యునిగా పర్యటించాడు.
2003 లో ప్రఖ్యత న్యూస్ ఛానల్ "బీ.బీ.సి" నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాల నుండి 1991 లో వచ్చిన మణిరత్నం "దళపతి" సినిమాలో "అరె చిలకమ్మా" పాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ అఫ్ అల్ టైం 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. 2013 లో ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సి.ఏన్.ఏన్-ఐ.బీ.ఏన్. వాళ్ళు 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండగను పురస్కరించుకుని నిర్వహించిన సర్వేలో 49% మంది ఇళయరాజా గారిని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు.
0 Comments