షకీలా "లేడీస్ నాట్ అలౌడ్" స్వంత మూవీ స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లో విడుదల
షకీలా "లేడీస్ నాట్ అలౌడ్" స్వంత మూవీ స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లో విడుదల.సినీ చరిత్రలో తొలిసారి.ఒక చిత్రం దాని స్వంత మూవీ స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లో విడుదలవుతోంది. "లేడీస్ నాట్ అలౌడ్" చిత్రం www.Ladiesnotallowed.com ద్వారా జులై 20న విడుదలవుతోంది.
అందరూ ఓ.టి.టి లలో సినిమాను విడుదల చేస్తుంటే..రొటీన్ గా చేస్తే ఏముంది అనుకున్నారో ఏమో గాని తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాకు ఒక వెబ్సైట్ చేసి నేరుగా అందులో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.సినిమా చూసేందుకు ప్రేక్షకులు 50 రూపాయులు చెలించాల్సి ఉంటుంది.ఈ సినిమాను జులై 20న రాత్రి ఎనిమిది గంటలకు విడుదల చేస్తున్నట్లు దర్శకుడు సాయి రామ్ దాసరి తెలిపారు.
నటి షకీలా సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లేడీస్ నాట్ ఎలౌడ్’. రమేష్ కావలి నిర్మిస్తున్నారు. విక్రాంత్ రెడ్డి సహ నిర్మాత. ఇదొక పూర్తిస్థాయి కామెడీ చిత్రం.
0 Comments