రంగనాథ్ జయంతి నేడు

రంగనాథ్ జయంతి నేడు



తిరుమల సుందర శ్రీరంగనాథ్ (జూలై 17, 1949 - డిసెంబర్ 19, 2015) విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. ఈయన 1949లో మద్రాసు నగరంలో టి.ఆర్.సుందరరాజన్, జానకీదేవి దంపతులకు జన్మించారు. ఈయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ చేశారు. రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్‌గా కొంతకాలం పనిచేశారు. 1969లో బుద్ధిమంతుడు సినిమాతో వెండితెరకు పరిచయమైనా, "చందన" చిత్రంలో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు సమ్మోహన పరఛి, సుమారు 300 సినిమాలలో నటించాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా సినిమా ప్రేక్షకులను మెప్పించాడు. మొగుడ్స్ పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కొన్ని టీ.వీ.సీరియళ్లలో కూడా నటించారు
.


Post a Comment

0 Comments