శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి కథలపై లఘుచిత్ర పోటీలు- 2021

శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి కథలపై లఘుచిత్ర పోటీలు- 2021
తేది.26.03.2021.

*తెలంగాణ ప్రభుత్వం - భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వైతాళికులు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి కథలపై లఘుచిత్ర పోటీల 2021 గోడ పత్రిక ను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ని తన కార్యాలయంలో ఆవిష్కరించారు*

ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ...కథా రచయిత, గోలకొండ పత్రికాధిపతులు, చరిత్రకారుడు, పరిశోధకుడు స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి గారి 125వ జయంతిని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు శ్రీ సురవరం కుటుంబ సభ్యులతో సమావేశం జరిపి, ఆ మహనీయుడి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం - భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మే 28న అధికారికంగా ఘనంగా నిర్వహించాలని మంత్రి సాంస్కృతిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ కు చెందిన వైతాళికులను, కవులను, కళాకారులను, సాహితీవేత్తలను, మహనీయుల జయంతి, వర్ధంతి లను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.

స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి గారి 125వ జయంతి నిర్వహణ లో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు రాసిన కథలు, కథానికలను ఆధారం చేసుకొని నిర్మించే లఘుచిత్రాల పోటీలను నిర్వహించడానికి నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా శ్రీ సురవరం గారి విగ్రహాన్ని ఏర్పాటు కు కృషి చేస్తున్నామన్నారు.  ఔత్సాహిక సినీ నిర్మాత దర్శకుల నుంచి ఈ లఘుచిత్రాలను ఆహ్వానిస్తున్నాము. ఈ లఘు చిత్రాలలో విజయం సాధించిన వారికి జయంతి వేడుకల సందర్భంగా జ్ఞాపికలను అందిస్తామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.

*ఈ పోటీలో పాల్గొనే లఘుచిత్రాల నియమ నిబంధనలు:-* 
•ఈ లఘుచిత్రాలు సురవరం ప్రతాపరెడ్డి గారు రాసిన కథలు, నాటకాల ఆధారంగానే రూపొందించాలి. 

లఘుచిత్రం ఏ కథ ఆధారంగా రూపొందిందో టైటిల్స్ లో ముందే వేయాలి.
• లఘుచిత్రాల నిడివి 20 నుండి 30 నిమిషాల లోపు ఉండాలి. 
• లఘుచిత్రాల నిర్మాణం నాణ్యతతో, మంచి కెమెరాతో చిత్రీకరించబడి ఉండాలి.
• ఎంపికైన అన్ని లఘుచిత్రాలు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రదర్శింపబడతాయి.

* ఉత్తమ చిత్రాల ఎంపిక నిపుణులైన జ్యురీ చేత నిర్వహిస్తామన్నారు.

• ఎంపికైన అన్ని లఘుచిత్రాలకు భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుండి ధృవీకరణ పత్రాలు అంద చేయబడతాయన్నారు.

• విజేతలకు జ్ఞాపికలు, నగదు బహుమతులు, ధృవీకరణ పత్రాలు ప్రదానం చేయబడతాయి. 
• 2021 మే మాసంలో రవీంద్రభారతి మెయిన్ హాల్ లో విజేతలకు బహుమతుల ప్రదానం జరుగుతుంది.

*లఘుచిత్రాలు - బహుమతులు*
• ఉత్తమ మొదటి లఘుచిత్రం  - రూ. 50,000/-
• ఉత్తమ రెండవ లఘుచిత్రం  - రూ. 40,000/-
• ఉత్తమ మూడవ లఘుచిత్రం  - రూ. 30,000/-
• ఉత్తమ దర్శకుడు          - రూ. 20,000/-
• ఉత్తమ ఛాయాగ్రాహకుడు  - రూ. 20,000/-
• ఉత్తమ సంగీత దర్శకుడు  - రూ. 20,000/-
• ఉత్తమ ఎడిటర్  - రూ. 20,000/-

-వివరాలకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుల కార్యాలయం ఫోన్ నెం.040-23212832 లేదా 9948152952 ను సంప్రదించవచ్చు.
-మీ లఘుచిత్రాలను, వాటి వివరాలను పంపించాల్సిన ఈమెయిల్: suravaramfilms2021@gmail.com
-ఎంట్రీలు పంపించాల్సిన చివరి తేదీ: మే 01, 2021.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు శ్రీ కపిల్ రెడ్డి, నివేదిత, రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments