Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Jun 28, 2021

మా’ అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నా-- మంచు విష్ణు

మా’ అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నా-- మంచు విష్ణు




మా నాన్నగారు 'మా' అసోసియేషన్ కు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, వారి నాయకత్వ లక్షణాలు నాకు మార్గదర్శకాలు అయ్యాయి. గతంలో 'మా' అసోసియేషన్ కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నేను పనిచేసినప్పుడు 'మా' బిల్డింగ్ ఫండ్ కి నా కుటుంబం తరుపున ఆ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25% అందిస్తానని మాట ఇచ్చాను. బిల్డింగ్ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నేను కొన్ని సలహాలు, సూచనలు చేసాను. అవి 'మా' కుటుంబ సభ్యుల సహకారంతో దిగ్విజయంగా అమలుచేశాను. ‘మా’ అసోసియేషన్ వ్యవహారలన్నిటినీ అతిదగ్గరగా జాగ్రత్తగా పరిశీలించిన నాకు 'మా' కుటుంబ సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన, అనుభవం ఉంది. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం. ‘మా’ సభ్యులలో కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా వుంటాము, అందుబాటులో ఉంటాము. 'మా' అసోసియేషన్ కి అధ్యక్షుడిగా నా సేవలను సంపూర్ణంగా అందించాలనుకుంటున్నాను.

‘మా’ అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నానని 'మా' కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియచేయడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. సినిమా పరిశ్రమని నమ్మిన కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు 'మా' కుటుంబ సభ్యుల భావాలు, బాధలూ బాగా తెలుసు.. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు మేమెంతో ఋణపడి ఉన్నాము. ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.
పెద్దల అనుభవాలు, యువరక్తంతో నిండిన కొత్త ఆలోచనలు కలగలిపి నడవాలనే నా ప్రయత్నం, మీ అందరి సహకారంతో విజయవంతం కావాలని ఆశిస్తూ... మీ ఆశీస్సులు కోరే..
- విష్ణు మంచు




 

No comments:

Post a Comment