ప్రతి ఛాలెంజ్ మనలో క్రియేటివిటిని పెంచుతుంది: సంచాలకులు మామిడి హరికృష్ణ






తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ప్రతివారం నిర్వహిస్తున్న సినివారంలో 2021, జూలై 17న 'రైతు గోస' మరియు 'రిపీట్' లఘుచిత్రాల ప్రదర్శన, టీంలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మామిడి హరికృష్ణ గారు చిత్ర బృందాలను అభినందించి, పోచంపల్లి ఇక్కత్ హండ్లూమ్ ఓవెన్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా,


హరికృష్ణ గారు మాట్లాడుతూ... మనకు ఎదులైన ప్రతి ఛాలెంజ్, మనలో క్రియేటివిటిని పెంచడానికి ఉపయోగపడుతుందని దాన్ని అనుసరిస్తూ ముందుకు సాగితే విజేతలుగా నిలుస్తారని,
నిడివి పరంగా షార్ట్ ఫిలిం చిన్నదయినప్పటికీ, కంటెంట్ పరంగా ఫీచర్ ఫిల్మ్ ను మించి ఉంటుందని అన్నారు. తాను అనుకున్న కథను తక్కువ టైంలో చెప్పడానికి ఫిలింమేకర్ ఎక్కువ కష్టపడాల్సివస్తుందని, షార్ట్ ఫిలిం తీసి తమ ప్రతిభను నిరూపించుకున్నవాళ్ళకు ఫీచర్ ఫిల్మ్ తీయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈనాటి సినివారంలో 'అప్పులు చేసి పంట పండించి డబ్బుతో కొడుకుని పట్నం పంపిస్తే, ఆ కొడుకు ఆ రైతును దగా చేస్తే అతని పరిస్థితి ఏంటి అన్న' కథాశంతో పీసీ ఆదిత్య దర్శకత్వం వహించిన "రైతు గోస", 'రోజూ ఒకే కల వస్తూ ఆదిత్యను వెంటాడుతోంది. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లిన ఆదిత్య ఆ కల నుంచి బయటపడ్డాడా లేదా ? అస్సలు ఆ కల ఆదిత్య కి ఎందుకు వస్తుందన్న' కథాంశంతో ఉత్తేజ్ సపహారం దర్శకత్వం వహించిన "రిపీట్" ఫిల్మ్ లు మంచి సందేశాన్ని చాటాయని పేర్కొంటూ, సాంస్కృతిక శాఖ తరపున అనేక కార్యక్రమాలను రూపొందించేందుకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, తనకు ప్రోత్సాహాం అందిస్తున్న సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రభుత్వ సలహాదారులు కె.వి. రమణాచారి గారికి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాస రాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు.



అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో చిత్రబృందాలు పాల్గొని చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రేమికులు, యంగ్ ఫిలిం మేకర్స్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments