వెల్కమ్ టు తీహార్ కాలేజ్ చిత్రం ఆడియో విడుదల 




వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ ఎన్ రావు మరియు యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్  "వెల్కమ్ టు తీహార్ కాలేజ్". ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లో విద్య పేరుతో జరుగుతున్న భందిఖానాని  అరాచకాన్ని సునిశిత  హాస్యం తో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇది. ర్యాంకుల పోటీలోపడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా ఆలోచింపజేసే విధంగా నిర్మించబడిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ వేడుకకి చదలవాడ శ్రీనివాసరావు, అజయ్ కుమార్, ఏం ఏం శ్రీలేఖ, జయచంద్ర రెడ్డి, ఎస్ వి రావు, సుభాష్ చక్రవర్తి రవడ, భార్గవ్, నిఖిలేష్ భరద్వాజ తదితరులు పాల్గున్నారు.
ఈ చిత్ర ఆడియోని శ్రీ బాలాజీ మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.



సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి మాట్లాడుతూ "వెల్కమ్ తో తీహార్ కాలేజీ చాలా గొప్ప సినిమా. పాటలు చాలా బాగా వచ్చాయి. కథకి కథనానికి అనుగుణంగా ఉంటాయి. సునీల్ గారితో జర్నీ చాలా గొప్పగా ఉంది. సినిమా చాలా గొప్పగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది" అని కోరుకున్నారు.

నిర్మాత ఎక్కలి రవీంద్ర బాబు మాట్లాడుతూ "ఈ చిత్రం నేటి యువతకి బాగా నచ్చుతుంది మరియు తల్లిదండ్రులకు కూడా బాగా నచ్చుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని కోరుకున్నారు.




మనోజ్ నందం మాట్లాడుతూ "ఈ చిత్రం నేటి ఎడ్యుకేషన్ సిస్టం గురించి ప్రతిఫలించేలా తీయడం జరిగింది. ప్రతి తల్లీ తండ్రి మరియు ప్రతి విద్యార్థి తప్పకుండా చూడాలి. మన ఎడ్యుకేషన్ సిస్టం మెరుగు కోసం చేసిన సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది " అని కోరుకున్నారు.

హీరో చక్రి మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి నిర్మాతకి ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా, మా సినిమా చూసి మంచి విజయవంతం చేస్తారు" అని కోరుకున్నారు.

హీరోయిన్ మనీషా మాట్లాడుతూ "ఇది నా మొదటి సినిమా. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి నిర్మాతకి ధన్యవాదాలు. ఈ చిత్రం ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టం గురించి, ప్రతి స్టూడెంట్ మనసుకి హత్తుకునేలా ఉంటుంది. అందరూ చూసి ఆశీర్వదిస్తారు" అని కోరుకున్నారు.


శ్రీలేఖ మాట్లాడుతూ "సునీల్ కుమార్ గారి దర్శకత్వం లో గంగ పుత్రులు మరియు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చిత్రంలో నేను పాట పాడాను. ఈ తీహార్ కాలేజీ చిత్రం లో పాటలు చాలా బాగున్నాయి. మంచి హిట్ అవుతుంది. ఈ కాలంలో చాలా మంది స్టూడెంట్స్ చదువుల ఒత్తిడి తో సూసైడ్ చేసుకుంటున్నారు, అది చాలా బాధాకరం. ఈ చిత్రం ప్రతి స్టూడెంట్ కి కనువిప్పు కావాలి" అని కోరుకున్నారు.





ముఖ్య అతిధి చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ "చిన్న సినిమాలు హిట్ అయితే అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. సునీల్ గారు మంచి చిత్రాలు నిర్మిస్తారు. ఈ తీహార్ కాలేజ్ చిత్రం కూడా మంచి చిత్రంగా నిలిచిపోవాలి" అని కోరుకున్నారు.

మాతృదేవోభవ దర్శకుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ " సమకాలీన అంశాలతో చిత్రాలు నిర్మిస్తే అవి తప్పక విజయవంతం అవుతుంది ఆ కోవలోకి ఈ చిత్రం వస్తుందని అన్నారు.

బాపి రాజు మాట్లాడుతూ "వెల్కమ్ తో తీహార్ కాలేజ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి విచ్చేసిన అతిదులందరికి ధన్యవాదాలు. యూత్ కి తల్లి తండ్రులకి అందరికి నచ్చుతుంది. మా చిత్రాన్ని అక్టోబర్ 28న విడుదల చేస్తాం" అని తెలిపారు.
 
సమావేశం లో సుభాష్ చక్రవర్తి, భార్గవ్, ఎస్ వి రావు, జయచంద్ర రెడ్డి తదితరులు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

చిత్రం పేరు : వెల్కమ్ టు తీహార్ కాలేజ్
బ్యానర్ : శ్రావ్య ఫిలిమ్స్
నటి నటులు : మనోజ్ నంధం ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, మౌనిక, తనీషా,  వినయ్ మహాదేవ్, స్టార్ మేకర్ సత్యానంద్, , బుగత సత్యనారాయణ, సముద్రం వెంకటేష్, నల్ల శ్రీను, మల్లికా తదితరులు
కెమెరా మాన్  & ఎడిటింగ్ : సాబు జేమ్స్
సంగీత దర్శకుడు : ప్రవీణ్ ఇమ్మడి.  
కలరింగ్ అమల్
వి ఎఫ్ ఎస్ : శ్యాం కుమార్ ,పీ
పి ఆర్ ఓ : పాల్ పవన్
సౌండ్ మిక్సింగ్: పద్మారావు

నిర్మాతలు : డాక్టర్ ఎల్ ఎన్ రావు యెక్కలి రవీంద్ర బాబు
దర్శకుడు : పి సునీల్ కుమార్ రెడ్డి


Post a Comment

0 Comments