- గాయత్రి విద్యా సంస్థల్లో సందడి చేసిన నమస్తే సేట్ జీ చిత్ర బృందం...
సందేశాత్మక చిత్రాలు రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని, నమస్తే సేట్ జీ సినిమా ఆ కోవలోకే వస్తుందనీ గాయత్రి విద్యా సంస్థల నిర్వాహకులు నరేందర్ పేర్కొన్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తల్లాడ సాయికృష్ణ హీరో గా ,స్వప్న చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న నమస్తే సేట్ జీ సినిమా డిసెంబర్ 9 న రెండు తెలుగు రాష్ట్రల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం గాయత్రి విద్యా సంస్థల్లో సందడి చేశారు. ఇందులో భాగంగా నరేందర్ చిత్ర బృందాన్ని అభినందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఘని విజయం సాధించాలని అన్నారు. సామాజిక ఇతివృత్తం తో తీసిన ఇలాంటి సినిమాలు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటాయని అన్నారు. అనంతరం దర్శకుడు తల్లాడ సాయి క్రిష్ణ మాట్లాడుతూ.., వినూత్న కథాంశం తో, వాస్తవిక స్థితి గతుల ఆధారంగా ఈ సినిమా ను రూపొందించామని అన్నారు. ఆంధ్రా పరిసర ప్రాంతాల్లో పర్యటించిన తమ బృందాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ప్రేక్షకులందరినీ నమస్తే సేట్ జీ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల విద్యార్ధులు, సినిమా బృందం డైరెక్షన్ డిపార్ట్మంట్ నుంచి శ్రీకాంత్ హనుమాద్రి, సతీష్, పవన్ ల్యూనాటిక్, బాలు, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు సినిమా బృందం తో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
0 Comments