అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి లో విష్ణు మంచు జిన్నా

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి లో విష్ణు మంచు జిన్నా



విష్ణు మంచు, సన్నీ లియోన్, పాయల్ రాజపుత్ హీరో, హీరోయిన్లు గా నటించిన 'జిన్నా' సినిమా అక్టోబర్ 21  న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమాకు ఫ్యాన్స్ నుంచి విశేషాదరణ దక్కింది. ఇప్పుడు జిన్నా చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి లో  విడుదల అయింది.  

థియేటర్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న 'జిన్నా' సినిమా డిసెంబర్ 2 అనగా ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో తెలుగు మరియు మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ అందించిన కోన వెంకట్ పర్యవేక్షణలో, శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

విష్ణు మంచు కి బాగా కలిసివచ్చిన కామెడీ జానర్ తో బాటు ఈ సినిమాలో థ్రిల్ కి గురి చేసే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర కామెడీ అయితే కడుపుబ్బా నవ్విస్తుంది. 

Post a Comment

0 Comments