Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Apr 24, 2023

గోపీచంద్, శ్రీవాస్, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘రామబాణం’ థర్డ్ సింగిల్ నువ్వే నువ్వే పాట లాంచ్ చేసిన శ్రీలీల



మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న 'రామబాణం'తో హ్యాట్రిక్ ని పూర్తి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాని ప్రమోట్ చేయడానికి మేకర్స్ సరైన స్ట్రాటజీలతో ముందుకు వెళుతున్నారు. మొదటి రెండు పాటలకు, ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ రోజ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గత బ్లాక్ బస్టర్ 'ధమాకా' హీరోయిన్ శ్రీలీల 'రామబాణం' థర్డ్ సింగిల్ లిరికల్‌ వీడియోని లాంచ్ చేశారు. మిక్కీ జె మేయర్ ఈ పాటని మెస్మరైజింగ్ ట్రాక్ గా కంపోజ్ చేశారు. ఇటు మెలోడి అటు బీట్ రెండిటిని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ... మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఈ పాటని స్వరపరిచారు.    

తను ఇష్టపడే అమ్మాయి అందంపై హీరో ప్రశంసలు కురిపించే పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. రితేష్ జి రావు ప్లజంట్ వాయిస్ పాటకు అదనపు ఆకర్షణ తెచ్చింది. కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ పాటలో విజువల్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. గోపీచంద్, డింపుల్ హయాతి అందంగా కనిపించారు. దినేష్ కుమార్ పాటకు కొరియోగ్రఫీ అందించారు.  

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.


No comments:

Post a Comment