నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించడం నాకే ఆశ్చర్యం కలిగించింది. నేను ఆయనతో అల వైకుంఠపురములో నుంచి ట్రావెల్ అవుతున్నాను. కానీ ఆయనకు సునీల్ వల్ల నా గురించి ముందే తెలిసింది. శంభో శివ శంభో సమయంలో నా గురించి సునీల్ చెప్పేవారట. అలా దర్శకుడిగా త్రివిక్రమ్ నన్ను ముందు నుంచే నమ్మారు.

విజువల్ గా ఎలా ఉండబోతుంది?
విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. ఇది 53 రోజుల్లో చేశాం. కానీ విజువల్స్ చూస్తుంటే చాలా రోజులు చేసినట్లు ఉంటుంది. 53 రోజులు ఒక్క సెకన్ కూడా వృధా చేయకుండా పనిచేశాం. 150 రోజులు షూట్ చేసిన సినిమాలా అవుట్ పుట్ ఉంటుంది. ఇప్పటిదాకా నేను చేసిన 15 సినిమాల్లో ఇదే నా బెస్ట్ మూవీ. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ అన్నయ్య నాకు ఒక తండ్రిలా అండగా నిలబడ్డారు.

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ ఎలా ఉండబోతుంది?
వాళ్ళ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. మనం ప్రత్యేకంగా ఏం చేయనక్కర్లేదు. కెమెరా పెడితే చాలు, వాళ్ళు స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేస్తారు.

పవన్ కళ్యాణ్ గారి గురించి?
పవన్ కళ్యాణ్ గారిని కలిసి మొత్తం స్క్రిప్ట్ అంతా వినిపించాక, షూటింగ్ ఎప్పటినుంచి అనుకుంటున్నారు అని అడిగారు. మీరు రెడీ అంటే రేపటి నుంచే సార్ అనగానే ఆయన షాక్ అయ్యారు. అలా ఆయనను కలిసిన మూడు రోజులకే షూటింగ్ స్టార్ట్ చేశాం. ఆయన సెట్ లో అడుగుపెట్టగానే మొదట ఏం జరుగుతుందోనని మొత్తం గమనిస్తారు. దర్శకుడిగా నేను ఎంత క్లారిటీగా ఉన్నాను అనేది ఆయనకు మొదటిరోజే అర్థమైంది. ఆయన ఈ సినిమా కోసం ఎంతో చేశారు. సమయం వృధా చేయకూడదని సెట్ లోనే కాస్ట్యూమ్స్ మార్చుకున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు ఉపవాసం చేశారు. ఎంతో నిష్ఠతో పనిచేశారు.

థమన్ సంగీతం గురించి?
థమన్ గురించి చెప్పాలంటే చెబుతూనే ఉండాలి. నేను తీసిన ఈ 15 సినిమాలలో మొదటిసారి థమన్ నేపథ్యం సంగీతం విని కంటతడి పెట్టుకున్నాను.

నిర్మాతల గురించి?
ఈ సినిమా విషయంలో నిర్మాతల సహకారం అసలు మర్చిపోలేను. సినిమాకి ఏది కావాలంటే అది సమకూర్చారు. వాళ్ళు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను.

Post a Comment

0 Comments