ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ''ఈ 'మంగళవారం' నవంబర్ 17న విడుదల అవుతోంది. ప్రేక్షకులు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. కొన్ని రోజుల క్రితం టీజర్ చూశా. షాక్ అయ్యా. టీజర్ చూసిన వెంటనే సినిమా చూడాలనే కోరిక మనలో అతి తక్కువ సినిమాలు కలిగిస్తాయి. 'మంగళవారం' టీజర్ సినిమా చూడాలనే కోరిక కలిగించింది. అజయ్ భూపతి గారు నాకు కథ చెప్పినప్పుడు ఏమన్నారో గుర్తు ఉంది. 'మీరు గర్వించే స్థాయిలో సినిమా తీస్తా' అని చెప్పారు. ట్రైలర్లో ఆ ఫీలింగ్ ఇచ్చారు. నాకు 'ఆర్ఎక్స్ 100' చాలా ఇష్టం. అందులో 'పిల్లా రా' సాంగ్ మా ఇంట్లో ఎప్పుడూ ప్లే అవుతుంది. ఆయన గొప్ప టెక్నీషియన్. పెద్ద దర్శకుడు అవుతాడని నాకు నమ్మకం ఉండేది. రెండు రోజుల క్రితం 'పుష్ప 2' షూటింగ్ జరుగుతుంటే... సుకుమార్ గారు వచ్చి 'మంగళవారం సినిమా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వెళ్తున్నావా? అని అడిగారు. అవునని చెప్పా. అప్పుడు ఆయనకు టీజర్ చూపించా. దర్శకుడు షాక్ ఇచ్చాడని సుకుమార్ గారు చెప్పారు. కొన్ని సినిమాలకు వైబ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాలో అటువంటి వైబ్ ఉంది. ప్రేక్షకులు అందరూ వచ్చి మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రాఫర్, సౌండ్ డిజైనర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ చాలా బాగా వర్క్ చేశారు. 'ఆర్ఎక్స్ 100' ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఇప్పుడు హీరోయిన్ పాయల్ కు 'మంగళవారం' మైల్ స్టోన్ కావాలని కోరుకుంటున్నా. ఆమెకు ఆల్ ది బెస్ట్. చాలా బోల్డ్ విషయం ఉన్న కథ ఇది. అజయ్ భూపతి కథ చెప్పినప్పుడు ఇటువంటి సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలని అనిపించింది. ఆయన బాగా డీల్ చేస్తారని అనుకున్నా. టీజర్, ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా తీశారని అనిపించింది. సినిమా అవుట్ పుట్ మీద పాజిటివ్ గా ఉన్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మనకు సక్సెస్ వస్తే వాళ్లకు వచ్చినట్లు ఎంజాయ్ చేసే ఫ్రెండ్ జీవితంలో చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఎదుగుతుంటే వాళ్ళు ఎదిగినట్లు ఫీలయ్యే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. నాకు అటువంటి స్నేహితులు స్వాతి, ప్రణవ్. వాళ్ళిద్దరూ నాకు క్లోజ్. ఇది నాకు సొంత సినిమాలాగా. మా గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా తీసినా, మా బన్నీ వాసు, ఎస్కేఎన్ సినిమా తీసినా నేను ఎలా ఫీల్ అవుతానో... ఈ సినిమాకూ అంతే! ముద్ర మీడియా వర్క్స్ సంస్థ స్థాపించి స్వాతి తీసిన తొలి సినిమా ఇది. ఇలాగే ఎన్నో మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రసాద్ గారు అంటే మాకు ఎప్పటి నుంచి రెస్పెక్ట్. మా టీవీ అప్పటి నుంచి ఆయన మాకు పార్ట్నర్. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. రెండేళ్ల క్రితం స్వాతి ఆఫీసుకు వచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నట్లు చెప్పింది. ఆమెను ప్రోత్సహించడానికి నేను కొన్ని మాటలు చెప్పా. కానీ, ఏ రోజూ నన్ను ఏమీ అడగలేదు. తన సొంతంగా సినిమా తీసింది. చిత్ర నిర్మాణంలో సురేష్ వర్మ లాంటి భాగస్వామి ఆమెకు లభించడం సంతోషంగా ఉంది. ఆయన కూడా నాకు మా టీవీ రోజుల నుంచి తెలుసు. నాకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అటెండ్ అయిన ఫస్ట్ ఫంక్షన్ ఇది. నాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. అందరి ప్రేమ, అశీసులతో గర్వించే స్థాయికి వెళ్లాలని నా కోరిక'' అని అన్నారు. శుక్రవారం విడుదల అవుతున్న 'మంగళవారం' సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించాలని కోరారు.
#AlluArjunForMangalavaaramMovie
#AlluArjun𓃵


No comments:
Post a Comment