Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Oct 10, 2024

ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా దసరా ఉత్సవాలు













ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ హైదరాబాద్ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా దసరా ఉత్సవాలు  

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ హైదరాబాద్ వారు బతుకుమ్మా, దాండియా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళా సభ్యులు ఎంతో మంది స్వయంగా పాల్గొని బతుకమ్మ ఆడి, దాండియాలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో  ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ శ్రీ కేఎస్ రామారావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్ఎన్ రెడ్డి గారు, సెక్రెటరీ శ్రీ తుమ్మల రంగారావు గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ సదాశివరెడ్డి గారు, ట్రెజరర్ శ్రీ శైలజ జూజాల గారు, కమిటీ మెంబర్లు ఏడిద రాజా, కాజా సూర్యనారాయణ, మురళీమోహన్ రావు, వీ.వీ.జి. కృష్ణంరాజు, భాస్కర్ నాయుడు, నవ కాంత్, బాలరాజు,వరప్రసాదరావు, భవానీ వంటివారు ఈ కార్యక్రమం ఏర్పాట్లు దగ్గరుండి చేశారు. ఇక కల్చరల్ కమిటీ కన్వీనర్ ఏడిద రాజా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇక సాంస్కృతిక శాఖకు చెందిన డాక్టర్ కే వెంకటేశ్వర్ రావు గారు, ఏ. గోపాలరావు కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment