సెలబ్రిటీల జీవితాల్లోని ఎవరికీ తెలియని కోణాలను ఆవిష్కరించే అన్‌స్క్రిప్టెడ్ తెలుగు ఒరిజినల్ – ది రానా దగ్గుబాటి షో ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్
రానా దగ్గుబాటి అతిధులలో దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య అక్కినేని, నాని, రిషబ్ శెట్టి, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీ లీల, S.S. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనేక మంది ప్రముఖులు ఉన్నారు.
స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రానా దగ్గుబాటి నిర్మించి, క్రియేట్ చేసి, హోస్ట్ చేస్తున్న ఈ సరికొత్త అన్‌స్క్రిప్టెడ్ ఒరిజినల్ సిరీస్, ఎనిమిది ఎపిసోడ్ల కార్యక్రమంలో ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొని, రానాతో అన్ ఫిల్టర్డ్ సంభాషణలు, ఎక్సయిటింగ్ యాక్టివిటీస్ లో పాల్గొంటారు.
నవంబర్ 23 నుంచి 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో ప్రసారం కానున్న 'ది రానా దగ్గుబాటి షో' ప్రతి శనివారం ఒక కొత్త ఎపిసోడ్ ఎక్స్ క్లూజీవ్ గా ప్రైమ్ వీడియోలో విడుదల అవుతుంది.
ఇండియాలో అత్యంత ఇష్టపడే ఎంటర్ టైన్మెంట్ డెస్టినేషన్ ప్రైమ్ వీడియోతన ఫస్ట్ ఎవర్ టాక్ షో - ది రానా దగ్గుబాటి షో - ట్రైలర్ ని లాంచ్ చేసింది. రానా దగ్గుబాటి స్వయంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ హోస్ట్ చేస్తున్న ఈ ఎనిమిది ఎపిసోడ్ సిరీస్‌లో ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొంటారు. దుల్కర్ సల్మాన్, నాగచైతన్య, నాని, రిషబ్ శెట్టి, సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీలీల, ఎస్.ఎస్.రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి అనేక మంది ప్రత్యేక అతిథులు ఇందులో ఉంటారు. భారతదేశం సహ ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో నవంబర్ 23 నుంచి ది రానా దగ్గుబాటి షో, ప్రతీ శనివారం కొత్త ఎపిసోడ్ ప్రైమ్ వీడియోలో ఎక్స్ క్లూజీవ్ గా విడుదల కానుంది.
రానా దగ్గుబాటి షో ట్రైలర్ సాంప్రదాయ చాట్ షోల మూసని బ్రేక్ చేస్తూ అభిమానులకు వారి అభిమాన తారల జీవితాల్లోకి ప్రత్యేకమైన కోణాల్ని అందించింది. దుల్కర్‌తో కలిసి టీ తాగడం, నాగ చైతన్యతో కార్లలో సూప్ చేయడం, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీ లీలతో పిజ్జాలు కాల్చడం, రాజమౌళి అవుట్‌డోర్ షూట్ సర్ ప్రైజ్.. ఇలా అతిథుల మునుపెన్నడూ చూడని కోణాన్ని రివిల్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో షో హోస్ట్, క్రియేటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. అందరినీ నమస్కారం. ఇది వరకు నేను కొన్ని టాక్ షోలు చేశాను. కానీ ప్రైమ్ వీడియోలో చేస్తున్న ఈ షో చాలా డిఫరెంట్. అందుకే దీనికి 'రానా దగ్గుబాటి షో' అని పేరుపెట్టాం. ఇది ఆర్డినరీ టాక్ షో కాదు! వెరీ ఆథెంటిక్, అన్ ఫిల్టర్డ్, అన్‌స్క్రిప్టెడ్ షో. షోలో కనిపించే సెలబ్రిటీల రియల్, ఫిల్టర్ చేయని జీవితాల్లోకి హైలీ ఎంటర్ టైనింగ్, ఇంటరాక్టివ్ విండో. వారితో, ఇండస్ట్రీతో నా కనెక్షన్ ఫ్యామిలీ లాంటిది. మా మాటలు, మేము పంచుకునే సమయాన్ని మరింత సరదాగా సహజంగా ప్రజెంట్ చేస్తుంది. సెలబ్రిటీలు ఇంట్లో వున్నటుగానే హానెస్ట్ గా, నేచురల్ గా ఉండేలా చేసే ఒక రకమైన హ్యాంగ్ అవుట్ స్పాట్. సెలబ్రిటీల రియల్, యూనిక్ పర్సనాలిటీని ప్రజెంట్ చేస్తుంది. సెలబ్రిటీల గురించి చాలా కొత్త విషయాలని డిస్కవరీ చేసే షో ఇది. చాలా మెమరబుల్ మూమెంట్స్ ని అందిస్తుంది. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా వుంది. 240 దేశాలలో ఈ షో ప్రసారం కావడం హ్యాపీగా వుంది. ప్రైమ్ వీడియోకి, మా స్పిరిట్ మీడియా టీంకి థాంక్ యూ. ఈ షో ఆడియన్స్ కి డిఫరెంట్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అందరూ ఎంజాయ్ చేసేలా వుంటుంది' అన్నారు.
0 Comments