బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు, విజయ్ కనకమేడల, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ 'భైరవం' నుంచి వెన్నెలగా అదితి శంకర్‌ ఫస్ట్ లుక్ రిలీజ్




లీడ్ యాక్టర్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లను రిలీజ్ చేసిన తర్వాత 'భైరవం' మేకర్స్ ఇప్పుడు ఫీమేల్ లీడ్ పాత్రలపై దృష్టి పెట్టారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. భైరవం ఇప్పటికే  స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది.

ఈ మూవీలో అదితి శంకర్‌ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమెను అల్లరి పిల్ల "వెన్నెల"గా పరిచయం చేశారు. పోస్టర్ అదితి  రస్టిక్ అవతార్‌లో, హాఫ్ సారీ ధరించి వైకిల్ నడుపుతూ కనిపించారు. నేచురల్ బ్యూటీ, ప్రజెన్స్ తో క్యారెక్టర్ ఎసెన్స్ ని ప్రజెంట్ చేశారు.

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ హరి కె వేదాంతం, సంగీతం  శ్రీ చరణ్ పాకాల. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు.

తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అదితి శంకర్
సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: KK రాధామోహన్
సమర్పణ: డా. జయంతిలాల్ గడ (పెన్ స్టూడియోస్)
సినిమాటోగ్రాఫర్: హరి కె వేదాంతం
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: చోటా కె ప్రసాద్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
డైలాగ్స్: సత్యర్షి, తూమ్ వెంకట్
సాహిత్యం: భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి
ఫైట్ మాస్టర్: రామకృష్ణ, నటరాజ్ మాడిగొండ
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
పీఆర్వో: వంశీ-శేఖర్

Post a Comment

0 Comments