రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’
సనాతన ధర్మం గొప్పదనాన్ని తెలియజేస్తూ రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్‌లో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. ‘రఫ్’ చిత్ర దర్శకుడు సుబ్బారెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సనాతన ధర్మం ఎంత గొప్పదో తెలియజేస్తూ పక్కా మాస్ కమర్షియల్ ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక స్టార్ హీరో నటిస్తుండగా, మరో స్టార్ డైరెక్టర్ స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు.
భారతదేశంలో అతి పవిత్ర ప్రదేశమైన వారణాసి పుణ్యక్షేత్రంలోనే షూటింగ్ మొత్తం జరుగుతందని దర్శకుడు సుబ్బారెడ్డి తెలియజేశారు. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలతో త్వరలో మీ ముందుకు వస్తామని రామభక్త హనుమా క్రియేషన్స్ సంస్థ తెలియజేసింది.
0 Comments