Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Jun 15, 2025

*2020 ఏడాదికి సెకండ్ బెస్ట్ ఫిలింగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డ్ అందుకున్న "కలర్ ఫొటో" మూవీ టీమ్*


*2020 ఏడాదికి సెకండ్ బెస్ట్ ఫిలింగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డ్ అందుకున్న "కలర్ ఫొటో" మూవీ టీమ్*


తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో సాయి రాజేశ్ కథను అందించి నిర్మించిన "కలర్ ఫొటో" సినిమాకు 2020 ఏడాదికి గానూ ద్వితీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం దక్కింది. శనివారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవ వేడుకల్లో ఈ పురస్కారాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కథా రచయిత, నిర్మాత సాయి రాజేశ్, దర్శకుడు సందీప్ రాజ్, హీరో సుహాస్, హీరోయిన్ చాందినీ చౌదరి అందుకున్నారు. ఈ హ్యాపీ మూవ్ మెంట్ "కలర్ ఫొటో" మూవీ టీమ్ సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సినిమా బెస్ట్ రీజనల్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్, ఫిలింఫేర్, సైమా అవార్డ్స్ గెల్చుకుంది. ఇప్పుడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ అందుకోవడం అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు.

సుహాస్, చాందినీ చౌదరి జంటగా దర్శకుడు సందీప్ రాజ్ "కలర్ ఫొటో" చిత్రాన్ని రూపొందించారు. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాయి రాజేష్, బెన్ని ముప్పానేని నిర్మించారు. 2020 అక్టోబర్ 23న ఆహా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. "కలర్ ఫొటో" సినిమా ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్స్ సొంతం చేసుకోవడం విశేషం.

No comments:

Post a Comment