Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Jun 22, 2025

ఆరోగ్యకమైన జీవితానికి యోగా అవసరం - తుమ్మల రంగారావు


ఆరోగ్యకమైన జీవితానికి యోగా అవసరం - తుమ్మల రంగారావు 
మానవ జీవితం సుఖంగా ,సంతోషంగా , ఆరోగ్యంగా సాగాలంటే యోగా ఎంతో అవసరమని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కార్యదర్శి తుమ్మల రంగారావు చెప్పారు . 
అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా శనివారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో యోగాను నిర్వహించారు. 
ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి యోగాను ఆమోదించిన తర్వాత జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకుంటున్నారని , జూన్ 21, 2015 నుంచి,  న్యూయార్క్, పారిస్, బీజింగ్, బ్యాంకాక్, కౌలాలంపూర్, సియోల్ , భారత దేశంతో సహా 177 దేశాలు  యోగ దినోత్సవం జరుపుకోవడం మనకు గర్వకారణమని చెప్పారు . 
మన సనాతన ధర్మలో యోగ ఉందని , భారత ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో యోగా విశ్వ వ్యాప్తం అయ్యిందని రంగారావు చెప్పారు . మన కల్చరల్ సెంటర్లో కూడా యోగాను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని , సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు . 
ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ సదాశివ రెడ్డి , కోశాధికారి  శైలజ , కార్యవర్గ సభ్యులు వేణు , రాజా , కోగంటి భవాని , మీడియా కమిటీ చైర్మన్ భగీరథ , కల్చరల్ కమిటీ అడిషనల్ చైర్మన్ సురేష్ కొండేటి మొదలైన వారు పాల్గొన్నారు .

No comments:

Post a Comment