*ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ (పేపర్ లీక్)*
స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి, గోరేటి వెంకన్న, అద్దంకి దయాకర్, దేశపతి శ్రీనివాస్, అందేశ్రీ, జయరాజ్, నందిని సిద్దారెడ్డి, ప్రొఫెసర్ ఖాసీం తో పాటు పలువురు విద్గ్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. వక్తలు ప్రసంగిస్తూ … యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా కేవలం విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ చూడదగిన మంచి చిత్రం అని కొనియాడారు
ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ: ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయి. కీర్తిశేషులు స్వర్గీయ గద్దర్ గారు , జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేష్ గొప్పగా రాశారు. ఈ చిత్రం కథాశం ఏమిటంటే…గత కొన్నేళ్లుగా మన విద్యారంగంలో జరుగుతున్న పేపరు లీక్ లు…గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ ప్రశ్న పత్రాల లీకులు చూస్తుంటే ఈ చదువులకేమైంది అని పిస్తుంది. ఇలా జరుగుతూ వుంటే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి ? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు జేస్తూ ఉంటుంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక నెల రాలుతుంటే కన్న తల్లితండ్రులు ఏమై పోవాలి. వాళ్లకు పాఠాలు బోధించిన గురువులు ఏమి కావాలి. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా నాగాసాకి హీరోషిమా ల మీద వేసిన ఆటంబాంబులు కంటే హైడ్రోజెన్ బాంబులు కంటే టొర్నాడోటార్పిడో ల కంటే సునామీ ల కంటే చాలా ప్రమాదకరమైనది కాపీయింగ్. చూసి రాసిన వాళ్ళు డాక్టర్లు అయితే పేషేంట్ బ్రతుకుతాడా?? అలాంటి వాళ్లు ఇంజినీర్ అయితే బ్రిడ్జిలు నిలబడుతయా? పేషెంట్లు బ్రతకాలి అన్న బ్రిడ్జిలు కూలిపోకుండా ఉండాలి అన్న, ప్రశ్న పత్రాలు లీకులు మాయం కాకూడదు. అందుకే విద్యను ప్రవేటు మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి విద్యను జాతీయం చేయాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి.అని చాటి చెప్పేదే ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ చిత్రం. ఆగస్టు 22 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాము అని అన్నారు.
నటీనటులు - ఆర్. నారాయణ మూర్తి, వైఎస్ కృష్ణేశ్వర్ రావు, తిరుపతి నాయుడు, విజయ్ కుమార్ మరియు నూతన తారాగణం.
పాటలు - గద్దర్ - జలదంకి సుధాకర్, - వేల్పుల నారాయణ.-మోటపలుకులు రమేష్,
ఎడిటింగ్ - మాలిక్
కెమెరా - బాబూరావు దాస్
కథ-స్క్రీన్ ప్లే - మాటలు - సంగీతం - దర్శకత్వం - నిర్మాత
ఆర్. నారాయణ మూర్తి
0 Comments