Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Jul 7, 2025

స్వతంత్ర భావోద్వేగాల స్వరం... “వసిష్ఠ” ప్రీమియర్‌కు ప్రముఖుల హాజరుతో ఘనంగా ఆరంభం!





ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన “వసిష్ఠ” స్వతంత్ర చిత్ర ప్రీమియర్ షో భావోద్వేగాల సముద్రంగా మారింది. ప్రేక్షకుల హృదయాలను తాకిన ఈ ప్రత్యేక సినిమా ప్రదర్శనకు సినీ, రాజకీయ, సాంకేతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై దర్శక నిర్మాతలపై అభినందనలు కురిపించారు.

దర్శకుడు వెంకటేశ్ మాహాంతి సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం, సామాజిక భావనలు, వ్యక్తిగత తలంపులు, మానవ సంబంధాల మధ్య జరిగే అంతర్మధనాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించింది. వాస్తవానికి దగ్గరగా, హృదయానికి దగ్గరగా ఉండే ఈ కథనానికి ప్రేక్షకుల నుండి అప్రతిహత స్పందన లభించింది.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్, నటుడు జెమినీ సురేష్ హాజరయ్యారు. అలాగే రాజేష్ పుత్రా, 1PM to 1AM వ్యవస్థాపకుడు శ్రీధర్, దీక్షితా గ్రూప్ వ్యవస్థాపకుడు ఏ.నరసింహ, బలగం జగదీష్, బిగ్ బాస్ ఫేమ్ సంజన, దర్శకుడు అయ్యప్ప నాయుడు తదితరులు ఈ వేడుకకు మరింత గౌరవాన్ని చేకూర్చారు.

నటీనటుల ప్రదర్శనలు, ప్రత్యేకించి రాజేష్ టెంకా, శణ్ముఖి, KLN, సమ్మేటి గాంధీ లు పలువురి ప్రదర్శనలు ప్రేక్షకులను కదిలించాయి. మ్యూజిక్, ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్షన్ సహా ప్రతి సాంకేతిక విభాగం ఈ చిత్రాన్ని స్థాయిలో నిలబెట్టింది.

ఈ సందర్భంగా చిత్రానికి గేయ రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడిగా పనిచేసిన జగదీశ్ దుగానా మాట్లాడుతూ,

> "ఇది ఒక్క సినిమా కాదు, ప్రతి భావోద్వేగానికి అద్దం. కమర్షియల్ ఆఫర్స్ లేకపోయినా, ఈ కథను చెప్పాలనే తపనతో ప్రతి ఒక్కరూ జీవించారు."



చిత్ర నిర్మాతలు రాజేష్ టెంకా, కిల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ –

> "ఇది పెద్ద బడ్జెట్ సినిమా కాదు. కానీ మనసుతో చేసిన సినిమా. ప్రతి ఒక్కరి కష్టమే ఈ రోజు ఇక్కడ ఫలితంగా నిలిచింది."



చివరగా, ప్రీమియర్ షో ముగిసే సమయానికి పలువురు ప్రముఖులు “వసిష్ఠ” చిత్రం ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శించేందుకు అనేక సూచనలు చేయడమేగాక, భవిష్యత్తులో దీని విలువ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

వసిష్ఠ… ఓ నిశ్శబ్ద స్వరం. కాని లోతైన గాథ. ఇది ఒక అభిప్రాయం కాదు, ఒక అనుభవం.

No comments:

Post a Comment