డైరెక్టర్ వీర శంకర్ చేతుల మీదుగా "శివం శైవం" పోస్టర్ విడుదల

డైరెక్టర్ వీర శంకర్ చేతుల మీదుగా "శివం శైవం" పోస్టర్ విడుదల

అమ్మ క్రియేషన్స్ బ్యానర్లో సాయి శ్రీనివాస్ MK స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా " శివం శైవం".

వినాయకచవితి సందర్భంగా సినిమా టైటిల్ రివిలింగ్ & కాన్సెప్ట్ పోస్టర్ ని ప్రముఖ డైరెక్టర్ వీరశంకర్ చేతుల మీదుగా విడుదల చేసారు. 
దినేష్ కుమార్ , అన్షు Ponnachen , రాజశేఖర్, జయంత్ కుమార్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కి క్రాంతి కుమార్ సినిమాటోగ్రఫీ, నిమిషి Zachhaeus సంగీతం, సుతపల్లి రామ లక్ష్మీ లిరిక్స్ అందించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వీర శంకర్ మాట్లాడుతూ మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించారు.టీం సభ్యులకి మంచి పేరు రావాలి అని, సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు.

నిర్మాత & డైరెక్టర్ MK సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే మా సినిమా 1స్ట్ లుక్ ని , కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసిన డైరెక్టర్ వీర శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవ సంఘటనలు ఆధారంగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. గ్రామీణ నేపథ్యంలో మైతాలజీ జోనర్ లో కాన్సెప్ట్ ఉండబోతుంది.
మా టీం మెంబర్స్ చాలా కష్టపడి ఈ సినిమా ని ఇష్టంగా చేస్తున్నాం.సాంగ్స్ & నేపథ్యం సంగీతం సినిమా చాలా సపోర్టు అవుతుంది.
ప్రతి ఒక్కరూ మా సినిమా కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సినీమా కి ఎదురేశపు అజయ్ PRO గా చేస్తున్నాడు.

Post a Comment

0 Comments