ఎమ్మెస్ రామారావు (మార్చి 7, 1921 - ఏప్రిల్ 20, 1992) పూర్తిపేరు మోపర్తి సీతారామారావు. ఈయనకు సుందర దాసు అనే బిరుదు ఉంది. ఈయన తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించాడు. గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన రామయణ భాగం సుందరకాండము ఎమ్మెస్ రామారావు సుందరకాండ గా సుప్రసిద్ధం. తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు. ఈ రెండూ ఈయనకు మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.
0 Comments