Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Oct 9, 2025

దర్శకుడు తేజ చేతుల మీదుగా బంజారాహిల్స్ లో ‘9 హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్’ ప్రారంభం

హైదరాబాద్: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో అత్యాధునిక సాంకేతికతతో 9 హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను గురువారం నాడు ఘనంగా  ప్రారంభించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మల్టీ మాడ్యులర్‌గా ప్రారంభించిన ఈ రిహాబిలిటేషన్ సెంటర్ విశేషాల గురించి ప్రతినిధులు పంచుకున్నారు. ఈ రిహాబిలిటేషన్ సెంటర్‌ను దర్శకుడు తేజ సినీనటి సంతోషిని మరియు శ్రీకర్ కలిసి ప్రారంభించారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో

దర్శకుడు తేజ మాట్లాడుతూ .. ‘‘జై’ సినిమా తరువాత మళ్లీ ఇన్నేళ్లకు సంతోషిని కలిశాను. చాలా సంతోషంగా ఉంది. సంతోషిని మరియు శ్రీకర్ కలిసి పెట్టిన ఈ రిహాబిలిటేషన్ సెంటర్‌ను పెట్టారు. హాస్పిటల్లో చికిత్స అందిస్తారు. కానీ ఆ తరువాత అందించాల్సిన సేవల్ని ఇంట్లో చేయలేం. ఇలాంటి సెంటర్లు చాలా అవసరం’ అని అన్నారు.

నటి సంతోషిని మాట్లాడుతూ .. ‘నా భర్త ఆలోచన నుంచి వచ్చిందే ఈ రిహాబిలిటేషన్ సెంటర్‌. మా ఇంట్లోనే పెద్ద వాళ్లని చివరి రోజుల్లో చూసుకోలేకపోయాం. అందుకే ఇలాంటి రిహాబిలిటేషన్ సెంటర్‌లు ఉంటే బాగుంటుందని మేం ఆలోచించాం. మా ఆలోచనకు డా. శివ, డా. నాగరాజు ప్రాణం పోశారు. 24 గంటలు ఇక్కడ అన్ని రకాల సేవల్ని అందిస్తాం. మా రిహాబ్ సెంటర్‌లో చాలా తక్కువ ధరలకే అన్ని రకాల సేవల్ని అందిస్తున్నామ’ ని అన్నారు.

నిర్వాహకులు మాట్లాడుతూ .. ‘9 హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ మల్టీ మాడ్యులర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రారంభించాం. ఈ రిహాబిలిటేషన్ అనేది మన ఇండియాలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. అయితే వెస్ట్రన్ కంట్రీస్‌లో మాత్రం ఎలాంటి ప్రమాదం జరిగినా, శారీరకంగా, మానసికంగా దెబ్బ తిన్నా కూడా.. రోగులకు ప్రభుత్వమే అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స అందిస్తుంటుంది. మనిషి బాధను తగ్గించేందుకు, పూర్వ స్థితిలోకి తీసుకు వచ్చేందుకు ఈ రిహాబిలిటేషన్ సెంటర్‌లు ఎంతో ఉపయోగపడుతాయి.

డా. శివ, డా. నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ సెంటర్‌ను మేం ప్రారంభించాం.  స్క్వీజ్ థెరపీ, స్వాలోయింగ్ థెరపీ, హియరింగ్ అండ్ డిస్పెన్స్, ఫిజియో థెరపీ, న్యూరో ఫిజియో థెరపీ, స్ట్రోక్ ఫిజియో థెరపీ, ఆర్థో ఫిజియో థెరపీ, చెస్ట్ ఫిజియో థెరపీ, జనరల్ ఫిజియో థెరపీ, పీడియాట్రిక్ ఫిజియో థెరపీ, జీరియాట్రిక్ ఫిజియో థెరపీ ఇలా అన్నింటినీ ఇక్కడ అందిస్తాం. అన్ని సేవల్ని కూడా పేషెంట్స్ కండీషన్స్ పట్టి ఛార్జ్ చేస్తాం. అందరికీ అందుబాటులో ఉండే ధరలతోనే సేవల్ని అందిస్తున్నాం. సమాజంలోని రుగ్మతల్ని తొలగించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. మా దగ్గర ఎమర్జెన్సీ సేవలు తప్పా మిగిలిన అన్నింటినీ అందుబాటులోకి తెచ్చాం’ అని అన్నారు.

#9HealthCare #RehabilitationCentre #Teja #Santoshini #Sreeker #Hyderabad #BanjaraHills #Physiotherapy #HealthCare #RehabCenter #TeluguNews #MedicalInnovation

సే స్టోరీ ప్రొడక్షన్స్, ఆర్3 ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సాయి కృష్ణ తెరకెక్కించిన ‘పంజరం’ ట్రైలర్ విడుదల

సే స్టోరీ ప్రొడక్షన్స్, ఆర్3 ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సాయి కృష్ణ తెరకెక్కించిన ‘పంజరం’ ట్రైలర్ విడుదల

సే స్టోరీ ప్రొడక్షన్స్, ఆర్3 ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆర్ రఘన్ రెడ్డి నిర్మాతగా సాయి కృష్ణ దర్శకత్వంలో అనిల్, యువతేజ, ముస్కాన్, రూప ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘పంజరం’. కొత్త వాళ్లంతా కలిసి చేసిన ఈ హారర్ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం నాడు రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్‌ మాత్రం వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. పేదరాసి పెద్దమ్మ అంటూ ఓపెన్ చేసిన ట్రైలర్, ఊరుని చూపించిన తీరు, హారర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. హారర్ మూవీకి ఉండాల్సిన కెమెరా వర్క్, ఆర్ఆర్ ‘పంజరం’లో కనిపించాయి. ట్రైలర్‌లో చివరి షాట్ మాత్రం అందరినీ భయపెట్టించేలానే ఉంది. ఈ ట్రైలర్ లాంఛ్ చేసిన అనంతరం ఈ కార్యక్రమంలో..

దర్శకుడు సాయికృష్ణ మాట్లాడుతూ .. ‘నాకు ఈ ప్రయాణంలో సహకరించిన టీంకు థాంక్స్. మోహన్ గారి మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. ఆర్ఆర్, పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరూ పెద్ద స్టార్స్ అవుతారు. ప్రదీప్ అన్న ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించారు. పద్మ గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. రమణ గారు, సురేష్ గారు, ప్రదీప్ గారు ఇలా అందరూ బాగా నటించారు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అనిల్, యువతేజ, ముస్కాన్, రూపలకు థాంక్స్. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా సినిమాకు ఆడియెన్స్, మీడియా సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాను’ అని అన్నారు.

హీరో యువతేజ మాట్లాడుతూ .. ‘‘పంజరం’ చిత్రంలో నేను మల్లి అనే పాత్రను పోషించాను. నా కారెక్టర్, లుక్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. మా దర్శకుడు సాయి ఈ మూవీని గొప్పగా తీశారు. అనిల్ నాకు చిన్ననాటి స్నేహితుడు. రూప, ముస్కాన్ అద్భుతంగా నటించారు. నాని అన్న మ్యూజిక్ అదిరిపోద్ది. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

హీరో అనిల్ మాట్లాడుతూ .. ‘‘పంజరం’ ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సినిమా కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఇందులో నేను కార్తిక్ అనే పాత్రను పోషించాను. మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

హీరోయిన్ రూప మాట్లాడుతూ .. ‘‘పంజరం’ చిత్రంలో వెన్నెల పాత్రను పోషించాను. నాకు ఇంత మంచి కారెక్టర్ ఇచ్చిన సాయి గారికి థాంక్స్. ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

హీరోయిన్ ముస్కాన్ మాట్లాడుతూ .. ‘‘పంజరం’ సినిమాకి మేం ప్రాణం పెట్టి పని చేశాం. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ నాని మోహన్ మాట్లాడుతూ .. ‘‘పంజరం’లో నాకు అవకాశం ఇచ్చిన టీంకు థాంక్స్. సాయి ఈ మూవీని చాలా అద్భుతంగా తీశారు. ‘పంజరం’ ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

నటి పద్మ మాట్లాడుతూ .. ‘35 ఏళ్ల తరువాత మళ్లీ నేను నటిగా ఎంట్రీ ఇస్తున్నాను. సాయి కృష్ణ ఈ మూవీని ఎంతో గొప్పగా తీశారు. యువతేజ, అనిల్, రూప, ముస్కాన్ అందరూ అద్భుతంగా నటించారు. ‘పంజరం’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

నటుడు రమణ మాట్లాడుతూ .. ‘యంగ్ టీం చాలా కష్టపడి ‘పంజరం’ మూవీని చేశారు. ఇలాంటి వాళ్లని ఆడియెన్స్ సపోర్ట్ చేయాలి. కొత్త వాళ్లని మీడియా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు ప్రదీప్ మాట్లాడుతూ .. ‘పన్నెండేళ్ల క్రితం మా జర్నీ ప్రారంభమైంది. సాయి కృష్ణతో షార్ట్ ఫిల్మ్‌ను తీశాను. అలా మా ప్రయాణం ప్రారంభమైంది. నాలుగేళ్ల క్రితం ‘పంజరం’ గురించి అనుకున్నాం. నన్ను ఆడిషన్ చేసి ఇందులో నాకు మంచి పాత్రను ఇచ్చారు. ముస్కాన్, రూప, అనిల్, యువతేజ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మా సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

#Panjaram #PanjaramTrailer #TeluguHorror #SaiKrishna #Anil #YuvaTeja #Muskan #Roopa #TeluguCinema #HorrorThriller #TeluguMovies2025 #SayStoryProductions #R3Productions #NaniMohan #NewTeluguMovies #HorrorVibes

KRAMP Trailer Update | Horror Thriller | Trailer Update Tomorrow at 11AM | Telugu Movie 2025

KRAMP Trailer Update | Horror Thriller | Trailer Update Tomorrow at 11AM | Telugu Movie 2025

The wait is almost over!
Get ready for the spine-chilling world of **#KRAMP** — where fear takes a new form.

**Trailer Update Tomorrow at 11 AM!**
Brace yourselves for a terrifying experience that will haunt your imagination!

Stay tuned for the official trailer and witness the rise of a new horror chapter in Telugu cinema!

#KrampTrailer #KrampMovie #TeluguHorror #HorrorThriller2025 #ComingSoon

📅 Trailer Update: **Tomorrow, 11 AM**
🔥 Don’t forget to **Subscribe** & **Hit the Bell Icon** for instant updates!

#KRAMP #KrampTrailer #KrampMovie #TrailerUpdate #TeluguCinema #TeluguHorror #HorrorThriller #ComingSoon #TeluguMovies2025 #ScaryMovie #TeluguFilm

లేడి సూపర్ స్టార్ విజయశాంతి చేతుల మీదుగా "దక్కన్ సర్కార్" సినిమా పోస్టర్ విడుదల


లేడి సూపర్ స్టార్ విజయశాంతి చేతుల మీదుగా  "దక్కన్ సర్కార్" సినిమా పోస్టర్ విడుదల

తెలంగాణ ఉద్యమకారుడు ప్రముఖ రచయిత కళా శ్రీనివాస్ గారు ప్రతిష్టత్మాకంగా నిర్మించిన "దక్కన్ సర్కార్" సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమం బంజారాహిల్స్ రోడ్ no 12 లో జరిగింది..లేడి సూపర్ స్టార్, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ శ్రీమతి విజయశాంతి గారు ఈ పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది..ఈ కార్యక్రమంలో మరో సీనియర్ ఉద్యమకారుడు, కళాకారుల జేఏసీ అధ్యక్షుడు మురళీధర్ దేశ్ పాండే, చిత్ర హీరో చాణక్య, మరో లీడ్ యాక్ట్రెస్ మౌనిక పాల్గొన్నారు..

విజయశాంతి గారు మాట్లాడుతూ..
ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న రచయిత, ప్రజాకళాకారుడు కళా శ్రీనివాస్ నిర్మిస్తున్న దక్కన్ సర్కార్ సినిమా ప్రజల్లోకి వెళ్లాలని, చిత్ర విజయానికి తన వంతు కృషి చేస్తానని సినిమా అప్డేట్స్ చూస్తే ఈ సినిమా విజయవంతం అవుతుందని 100 మంది ఆర్టిస్టులు, 50 మంది టెక్నిషియన్ల కృషి ఈ సినిమాకు ఉందని.. తెలంగాణ ప్రాంతం నుండి ఇలాంటి మరిన్ని చిత్రాలు రావాలని.. దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుందని తెలపడం జరిగింది..

మురళీధర్ దేశ్ పాండే మాట్లాడుతూ..
తెలంగాణ అస్తిత్వానికి అద్దం పట్టే ఇలాంటి సినిమాల నిర్మాణం జరగాలని..ప్రభుత్వం తెలంగాణ సినిమాలను, కళాకారులను ప్రోత్సహించాలని కోరుతూ చిత్ర యూనిట్ ను అభినందించారు..
చిత్ర దర్శకుడు, నిర్మాత కళా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇది ప్రజల జీవన స్థితిగతుల కథ అని, సహజ సంఘటనలను బేస్ చేసుకొని సహజ సిద్ధంగా నిర్మించిన చిత్రం అని, 2 సంవత్సరాలు కష్టపడి ఎన్నో ఒడుదొడుకులు తట్టుకొని పూర్తి చేశామని, ఈ సినిమాని తన అభిమాన తార విజయశాంతి గారు ప్రమోషన్ చెయ్యడం తనకు ఎంతో గొప్పగా అనిపించింది అని విజయశాంతి గారికి, మిగతా అతిధులకు చిత్ర హీరో, హీరోయిన్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు..

చిత్ర ప్రధాన నటుడు చాణక్య మాట్లాడుతూ ఈ సినిమా కోసం నేను చాలా యాస, భాష గ్రామీణ పరిస్థితులు హావభావాలు ఇలా చాలా నేర్చుకున్నానని, ఈ చిత్ర విజయం మాకు అవసరం అని, దానికి ప్రజల ఆశీర్వాదం కావాలని ఈ సందర్భంగా సినిమా పోస్టర్ రిలీజ్ చేసి సినిమాకు మద్దతుగా నిలిచిన విజయశాంతి గారికి, సినిమా నిర్మాత, దర్శకుడు కళా శ్రీనివాస్ గారికి, మౌనిక గారికి, దేశ్ పాండే గారికి కృతజ్ఞతలు తెలిపారు.

మరో నటి మౌనిక మాట్లాడుతూ..
ఈ సినిమాలో నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన సుమారు 40 మంది కళాకారులు పాల్గొన్నారు.

#DakkanSarkar #Vijayashanthi #KalaSrinivas #TelanganaCinema #TeluguMovies2025 #Chanakya #Mounika #TelanganaPride #TelanganaMovie #PosterLaunch #TeluguFilm

Oct 4, 2025

డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ, రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, చిలకా ప్రొడక్షన్స్ కొత్త చిత్రం 'అనుమాన పక్షి',  టైటిల్, ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ రిలీజ్, త్వరలో థియేటర్లలో రిలీజ్
రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ 2022లో DJ టిల్లుతో అద్భుతమైన అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఆ పాత్ర తెలుగు రాష్ట్రాల్లో ఇంటి పేరుగా మారింది. ఇప్పుడు విమల్ కృష్ణ మరోసారి సర్ ప్రైజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఈసారి డిఫరెంట్ స్టయిల్ లో మరొక విచిత్రమైన పాత్రను పరిచయం చేశాడు. అతని అప్ కమింగ్ ప్రాజెక్ట్‌ను చిలకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది, ఇది ఆ ఒక్కటి అడక్కు వంటి చిత్రాల తర్వాత బ్యానర్ నాల్గవ వెంచర్. రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. ట్యాలెంటెడ్ రాగ్ మయూర్ హీరోగా నటిస్తుండగా, మెరిన్ ఫిలిప్ హీరోయిన్.

దసరా శుభ సందర్భంగా, నిర్మాతలు తమ అప్ కమింగ్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. 'అనుమాన పక్షి' అనే టైటిల్ రాగ్ మయూర్ పాత్ర విచిత్రమైన స్వభావాన్ని సూచిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక  కామిక్ పుస్తక బ్యూటీని కలిగి ఉంది, రంగురంగుల ఆలోచన బుడగలు ఆఫ్‌బీట్, హిలేరియస్  ప్రశ్నలు సినిమా యూనిక్ నెస్ ని ప్రజెంట్ చేస్తోంది. మోషన్ పోస్టర్‌లోని  విజువల్స్, శ్రీ చరణ్ పాకాల సంగీతం ఎంటర్‌టైమెంట్ డబుల్ చేశాయి.

ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్ ఈ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జెకె మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అభినవ్ కునపరెడ్డి ఎడిటర్.

అనుమాన పక్షి త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.

#AnumanaPakshi #VimalKrishna #DJTillu #RagMayur #MarinPhilip #ChilakaProductions #SriCharanPakala #TeluguCinema #FirstLook #MotionPoster #UpcomingTeluguMovie #DasaraSpecial

5 October 2025


via https://www.youtube.com/watch?v=NGsq4iApKEU

5 October 2025


via https://www.youtube.com/watch?v=LfClX_J3Dnk

4 October 2025


via https://www.youtube.com/watch?v=FwWMCqUJMU8

4 October 2025


via https://www.youtube.com/watch?v=54B_SfO3sgU

Sep 25, 2025

కిరణ్ అబ్బవరం నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్! 👍


🔥🔥 హాట్ న్యూస్: కిరణ్ అబ్బవరం నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్! 👍

సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో... 'పుష్ప' టీమ్ నుండి మరో ప్రతిభావంతుడు పరిచయం!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తన తదుపరి ప్రాజెక్ట్‌  సినీ వర్గాలలో ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు సుకుమార్ గారి నిర్మాణ సంస్థ @Sukumarwritings ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తోంది.

నిర్మాత: #VamsiNandipati 🎬

ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి నిర్మించనున్నారు.

దర్శకత్వ పర్యవేక్షణ: సుకుమార్ అసిస్టెంట్!

ఈ సినిమాతో సుకుమార్ గారి కో-అసిస్టెంట్, #VeeraKogatam (వీర కోగటం) దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ముఖ్యంగా వీర కోగటం, ఇండియన్ సినిమా హిట్‌లలో ఒకటైన #Pushpa మరియు ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న #Pushpa2 (పుష్ప 2) చిత్రాలకు వర్క్ చేశారు.

'పుష్ప' యూనిట్‌లో కీలక పాత్ర పోషించిన టాలెంటెడ్ టెక్నీషియన్, ఇప్పుడు దర్శకుడిగా మారి, కిరణ్ అబ్బవరంతో సినిమా చేయనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కిరణ్ అబ్బవరం - సుకుమార్ రైటింగ్స్ కలయికలో రాబోతున్న ఈ కొత్త సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి. ఈ కాంబినేషన్ నుండి ఎలాంటి విభిన్నమైన కథ రాబోతుందో తెలుసుకోవడానికి #Tollywood ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

#KiranAbbavaram #SukumarWritings #PushpaTheRule #FilmUpdate

Aug 27, 2025

డైరెక్టర్ వీర శంకర్ చేతుల మీదుగా "శివం శైవం" పోస్టర్ విడుదల

డైరెక్టర్ వీర శంకర్ చేతుల మీదుగా "శివం శైవం" పోస్టర్ విడుదల

అమ్మ క్రియేషన్స్ బ్యానర్లో సాయి శ్రీనివాస్ MK స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా " శివం శైవం".

వినాయకచవితి సందర్భంగా సినిమా టైటిల్ రివిలింగ్ & కాన్సెప్ట్ పోస్టర్ ని ప్రముఖ డైరెక్టర్ వీరశంకర్ చేతుల మీదుగా విడుదల చేసారు. 
దినేష్ కుమార్ , అన్షు Ponnachen , రాజశేఖర్, జయంత్ కుమార్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కి క్రాంతి కుమార్ సినిమాటోగ్రఫీ, నిమిషి Zachhaeus సంగీతం, సుతపల్లి రామ లక్ష్మీ లిరిక్స్ అందించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వీర శంకర్ మాట్లాడుతూ మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించారు.టీం సభ్యులకి మంచి పేరు రావాలి అని, సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు.

నిర్మాత & డైరెక్టర్ MK సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే మా సినిమా 1స్ట్ లుక్ ని , కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసిన డైరెక్టర్ వీర శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవ సంఘటనలు ఆధారంగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. గ్రామీణ నేపథ్యంలో మైతాలజీ జోనర్ లో కాన్సెప్ట్ ఉండబోతుంది.
మా టీం మెంబర్స్ చాలా కష్టపడి ఈ సినిమా ని ఇష్టంగా చేస్తున్నాం.సాంగ్స్ & నేపథ్యం సంగీతం సినిమా చాలా సపోర్టు అవుతుంది.
ప్రతి ఒక్కరూ మా సినిమా కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సినీమా కి ఎదురేశపు అజయ్ PRO గా చేస్తున్నాడు.

27 August 2025


via https://www.youtube.com/watch?v=J9TbGdRdnNk

Aug 8, 2025

9 August 2025


via https://www.youtube.com/watch?v=i-QSDEyt3kA

హీరోయిన్ అంజలి, 9 క్రియేషన్స్, డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల కాంబో మూవీ గ్రాండ్ లాంఛ్

*హీరోయిన్ అంజలి, 9 క్రియేషన్స్, డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల కాంబో మూవీ గ్రాండ్ లాంఛ్*

బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్ లో  9 క్రియేషన్స్ నిర్మాణంలో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల  రూపొందిస్తున్న కొత్త మూవీ ఈ రోజు హైదరాబాద్ లోని మూవీ ఆఫీస్ లో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ చిత్రానికి రాజచంద్రశేఖర్ రెడ్డి కందుల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల గతంలో సుడిగాలి సుధీర్ తో "సాఫ్ట్ వేర్ సుధీర్", "గాలోడు" అనే కమర్షియల్ గా సక్సెస్ ఫుల్ చిత్రాలు రూపొందించి దర్శకుడిగా తన ప్రతిభ నిరూపించుకున్నారు. అంజలితో చేస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ ఫిలిం ఆయన కెరీర్ లో మరో స్పెషల్ మూవీ కానుంది. 

డిఫరెంట్ కాన్సెప్ట్ తో లేడీ ఓరియెంటెడ్ జానర్ లో  సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ కలర్ ఫుల్ విజువల్స్ అందించనున్నారు. ఈ చిత్రానికి పనిచేసే ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు - అంజలి, తదితరులు

డీవోపీ - సి.రాంప్రసాద్
బ్యానర్ - 9 క్రియేషన్స్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ - రాజచంద్రశేఖర్ రెడ్డి కందుల
రచన, దర్శకత్వం - రాజశేఖర్ రెడ్డి పులిచర్ల

"విద్యా దీపం" మూవీ ప్రారంభోత్సవం


 "విద్యా దీపం" మూవీ ప్రారంభోత్సవం 

ఆధ్యాత్మికతకు నిలయమైన శ్రీ శిరిడీ సాయిబాబా ఆశీస్సులతో "ఆశయ కలిగిన మీయందరికి మా ఆహ్వానం..." అంటూ **RSR మూవీస్** బ్యానర్‌పై కొత్త చిత్రం **"విద్యా దీపం"** షూటింగ్‌కు శుభారంభం కాబోతుంది.

ఈ చిత్రం యొక్క **పూజా కార్యక్రమం మరియు షూటింగ్ ప్రారంభోత్సవం** **ఆగస్టు 9వ తేదీన, శనివారం** నాడు **ఉప్పలూరు (గ్రామం), కాశినాయన మండలం, నర్సాపురం (పోస్ట్), కడప (YSR) జిల్లా**లో ఘనంగా జరగనుంది.

ఈ చిత్రంలో కథానాయకుడిగా **ముత్యముల లోకేష్ రెడ్డి**, కథానాయికగా **సావిత్రి కృష్ణ** నటిస్తున్నారు. సినిమా కథను చక్కగా తెరకెక్కించేందుకు దర్శకత్వ బాధ్యతలను **ఎస్. కె. పులివెందుల** తీసుకున్నారు. నిర్మాతగా **శ్రీను శ్రీపతి** వ్యవహరిస్తున్నారు.

ఇది ఒక సామాజిక అంశంపై ఆధారపడి, సమాజంలో విద్య యొక్క ప్రాధాన్యతను తెలియజేసే సందేశాత్మక చిత్రం అవుతుందని సమాచారం. గ్రామీణ నేపథ్యం, ఆత్మీయత, విలువలతో కూడిన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా యువతకు ప్రేరణనిచ్చే విధంగా సాగనుంది.

**కాంటాక్ట్ నంబర్లు:**
📞 7981428780
📞 7989977866

విశేషం ఏమిటంటే, ఈ చిత్రం ద్వారా కొత్త నటీనటులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా RSR మూవీస్ ముందుకొస్తోంది.
సినిమా ప్రేమికులు, స్థానికులు, సినీ పరిశ్రమ వ్యక్తులందరికీ ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఆహ్వానం.



Jul 25, 2025

25 July 2025


via https://www.youtube.com/watch?v=wjK6lGcx8ws

*ప్రపంచ సినిమా చరిత్రలోనే ప్రప్రథమం* *ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!*



*ప్రపంచ సినిమా చరిత్రలోనే ప్రప్రథమం*
*ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!*

మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా, శతాధిక చిత్ర నిర్మాతల్లో  రెండవ వాడిగా ఘనతకెక్కిన భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ... ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 15 చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రపంచ రికార్డుగా నమోదు కానున్న ఈ చారిత్రక ఘట్టానికి హైద్రాబాద్ లోని సారధి స్టూడియో వేదిక కానుంది. సినిమా రంగంతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రపంచ రికార్డుకు ప్రత్యక్ష సాక్షులు కానున్నారు. మన భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ అరుదైన ఘట్టం శ్రీకారం చుట్టుకోనుంది!!

OG, ఉస్తాద్ భగత్ సింగ్ తరువాత సినిమాలు ఆపేస్తా..!? Pawan Kalyan Exclusiv...



పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ | Power Start Pawan Kalyan Interview ...



Pawan Kalyan First Interview | Hari Hara Veera Mallu Movie | #pspkfans |...



Jul 22, 2025

Pawankalyan||live||


via https://www.youtube.com/watch?v=f2EeN-krkAk

సినిమా నా రక్తంలో ఉంది – పవన్ కళ్యాణ్





తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు — హరిహర వీరమల్లు (HHVM), ఓజి (OG), మరియు ఉస్తాద్ భగత్ సింగ్ (UBS). ఈ సినిమాల పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, వీటి తరువాత పవన్ కళ్యాణ్ సినీ జీవితాన్ని కొనసాగిస్తారా? లేక పూర్తిగా రాజకీయాలకే పరిమితం కాబోతున్నారా? అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఈ అంశంపై స్పందిస్తూ అన్నారు –

"సినిమా నా రక్తంలో ఉంది. నేను నటన నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవచ్చు, కానీ సినిమాల నుంచి నేను పూర్తిగా దూరంగా ఉండే వ్యక్తిని కాదు. త్వరలోనే 'PK Creative Works' అనే బ్యానర్ ద్వారా మంచి సినిమాలను నిర్మించబోతున్నాను."

ఈ మాటలు ఆయన సినీ పట్ల ఉన్న ప్రేమను, నిబద్ధతను చాటిచెప్పాయి. నటుడిగా కాకపోయినా, నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగాలని పవన్ తీసుకున్న నిర్ణయం ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ నిర్మాణం చేపట్టే సినిమాలు కొత్తవారికి అవకాశం కల్పించేలా, సమాజానికి సందేశమివ్వగలిగేలా ఉండే అవకాశముంది.

ఇప్పటికే ఆయనకు ఉన్న విపరీతమైన ఫ్యాన్ బేస్, రాజకీయాల్లో అతివ్యస్తత కూడా ఆయన్ను పూర్తిగా సినిమా నుంచి దూరంగా పెట్టలేవు. నటనకు విరామం ఇచ్చినా, నిర్మాతగా ఉండటం ద్వారా ఆయనకు సినిమాలపై ఉన్న ప్రేమను కొనసాగించగలుగుతారు. 'PK Creative Works' ద్వారా రానున్న కాలంలో కొత్త రకమైన సినిమాలు, కొత్త కథానాయకుల్ని మనం చూడొచ్చని అంచనా.

మొత్తంగా చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకోవడం లేదు. కాకపోతే నటుడిగా కాకుండా, నిర్మాణ విభాగంలో కొనసాగబోతున్నారు. ఇది ఆయన అభిమానులకు కొత్త ఆశలు, కొత్త ఎదురుచూపులను కలిగిస్తోంది.

TRIMUKHA MOVIE MOTION POSTER | Yogesh, Sunny Leone, Akriti Agarwal | Ra...



22 July 2025


via https://www.youtube.com/watch?v=Q5FJurkWpD8

Jul 14, 2025

K-RAMP Glimpse | Kiran Abbavaraam | Yukti Thareja | Jains Nani | Razesh ...



ద బిగ్ ఫోక్ నైట్ 2025.



ఉద‌యం లేచింది మొద‌లు ప్ర‌తి ప‌నితో పాట ముడిప‌డి ఉంటది. మ‌నిషి మ‌నుగ‌డ‌తో పాటు పాట కూడా అభివృద్ధి  చెందుతూ వ‌స్తుంది. ప్ర‌పంచానికి తెలియ‌ని ఎన్నో అత్య‌ద్భుత‌మై‌న జాన‌ప‌దాలు వంద‌లు, వేలు బ‌య‌టికి వ‌స్తున్నా, ఇంకా ల‌క్షణంగా ఉండే ల‌క్ష‌ల పాట‌లు మ‌ట్టిలోనే ఉండిపోయాయి. ఆ ల‌క్ష‌ల పాట‌ల‌ను వెలికితీసి భావి త‌రాల‌కు అందిస్తున్న తెలంగాణ జాన‌ప‌ద గాయ‌కుల‌కు ప‌బ్బ‌తిగ‌ట్టి బిగ్‌టీవీ పాటాభిషేకం చేస్తున్న‌ది. పాట‌కు బ‌తునివ్వ‌డానికి బ‌తుకుకు పాట‌నివ్వ‌డానికి బిగ్‌టీవీ స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తున్న కార్య‌క్ర‌మం ద బిగ్ ఫోక్ నైట్ 2025.ద బిగ్ ఫోక్ నైట్ -2025 లైవ్ ఫోక్ మ్యూజిక‌ల్ కాన్సెర్ట్ పోస్ట‌ర్‌, ప్రోమో లాంచ్ కార్య‌క్ర‌మం.. శుక్ర‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు మాదాపూర్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో అట్ట‌హాసంగా జ‌రిగింది. 60 మంది తెలంగాణ జాన‌ప‌ద ర‌చ‌యిత‌లు, గాయ‌కులు, సంగీత ద‌ర్శ‌కులు పాల్గొని కార్య‌క్ర‌మాన్ని వినోద‌భ‌రితం చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌ర‌గ‌ని ఈ కార్య‌క్ర‌మానికి బిగ్‌టీవీ ఒక కొత్త‌ పంథాకు శ్రీ‌కారం చుట్టింది. ఎలిమెంట‌ల్ మీడియా ద్వారా, ఎంట్రీవాలా టికెటింగ్ పార్ట్‌న‌ర్లుగా ద బిగ్ ఫోక్ నైట్ కార్య‌క్ర‌మం భారీ ఎత్తున జ‌రుప‌నున్నారు.బిగ్ టీవీ సీఈఓ అజ‌య్ రెడ్డి  కొండా మాట్లాడుతూ.. తెలంగాణ జాన‌ప‌దం‌లో ఇంకా మ‌ట్టి ప‌రిమ‌ళం మిగిలి ఉన్న‌ది. త‌ర‌త‌రాల వార‌స‌త్వం నుంచి వ‌స్తున్న జాన‌ప‌దానికి త‌మవంతుగా ఏదైనా చెయ్యాల‌ని త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మమే ద బిగ్ ఫోక్ నైట్ 2025 అని అన్నారు. ఆగ‌స్టు 23న శ‌నివారం నాడు హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఈ కార్య‌క్ర‌మ ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. 60 మంది తెలంగాణ జాన‌ప‌ద క‌ళాకారులు క‌లిసి ఒకే వేదిక‌ను పంచుకోవడం ఇదే మొద‌టిసారి.. అలాంటి అవ‌కాశం ఇలా త‌మ సంస్థ రూపంలో రావ‌డం త‌మ‌ అదృష్టం అని అన్నారు. ‌ప్ర‌ముఖ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ..ఒక మైకెల్ జాక్స‌న్‌, ఒక బుపెన్ హెజారికా, ఒక నూరాన్ సిస్ట‌ర్స్‌, ఒక రేష్మ‌, ఒక గద్ద‌ర్ ఒకే వేదిక‌పై క‌నిపించే భాగ్యం ఈ త‌రం నోచుకోలేదు. కానీ వాళ్ల‌కు ధీటుగా, సాటిగా, మేటిగా తెలంగాణ జాన‌ప‌ద క‌ళాకారులు అక్ష‌ర న‌క్ష‌త్రాల గాత్రులై ఒక మ‌హా వేదిక‌పైన ఒకే సారి క‌నిపిస్తే ఎలా ఉంటుందో మాటల్లో వ్య‌క్తిక‌రించ‌లేం.. త‌ప్ప‌కుండా చూసి తీరాల్సిందే అన్నారు.సంగీత ద‌ర్శ‌కులు వందేమాత‌రం శ్రీ‌నివాస్ మాట్లాడుతూ.. చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో  తెలంగాణ జాన‌ప‌ద గాయ‌కులంద‌రినీ ఒకే వేదిక‌పై చూసే అదృష్టం చాలా అరుదుగా వ‌స్తుంది. అలాంటి అరుదైన కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టిన బిగ్‌టీవీకి అభినంద‌న‌లు. ఈ కార్య‌క్ర‌మంలో న‌న్ను భాగ‌స్వామిగా చేసినందుకు ఆనందంగా ఉంద‌న్నారు.వేదిక‌పై మ‌ధుప్రియ‌, రాము రాథోడ్‌, క‌న‌క‌వ్వ ఇత‌రులు చేసిన జాన‌ప‌ద పాట‌ల‌, నృత్య ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకున్న‌ది. ఊర్రుత‌లూగించింది.

 

Jul 10, 2025

*ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ (పేపర్ లీక్)*


*ఆగస్టు  22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న  పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ (పేపర్ లీక్)*

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో  ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి, గోరేటి వెంకన్న, అద్దంకి దయాకర్, దేశపతి శ్రీనివాస్, అందేశ్రీ, జయరాజ్, నందిని సిద్దారెడ్డి, ప్రొఫెసర్ ఖాసీం తో పాటు పలువురు విద్గ్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. వక్తలు ప్రసంగిస్తూ … యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా కేవలం విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ చూడదగిన మంచి చిత్రం అని కొనియాడారు 

 ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ:  ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయి. కీర్తిశేషులు స్వర్గీయ గద్దర్ గారు , జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేష్ గొప్పగా రాశారు. ఈ చిత్రం కథాశం ఏమిటంటే…గత కొన్నేళ్లుగా మన విద్యారంగంలో జరుగుతున్న పేపరు లీక్ లు…గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ ప్రశ్న పత్రాల లీకులు చూస్తుంటే ఈ చదువులకేమైంది అని పిస్తుంది. ఇలా జరుగుతూ వుంటే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి ? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు జేస్తూ ఉంటుంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక నెల రాలుతుంటే కన్న తల్లితండ్రులు ఏమై పోవాలి. వాళ్లకు పాఠాలు బోధించిన గురువులు ఏమి కావాలి. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా నాగాసాకి హీరోషిమా ల మీద వేసిన ఆటంబాంబులు కంటే హైడ్రోజెన్ బాంబులు కంటే టొర్నాడోటార్పిడో ల కంటే సునామీ ల కంటే చాలా ప్రమాదకరమైనది కాపీయింగ్. చూసి రాసిన వాళ్ళు డాక్టర్లు అయితే పేషేంట్ బ్రతుకుతాడా?? అలాంటి వాళ్లు ఇంజినీర్ అయితే బ్రిడ్జిలు నిలబడుతయా? పేషెంట్లు బ్రతకాలి అన్న బ్రిడ్జిలు కూలిపోకుండా ఉండాలి అన్న, ప్రశ్న పత్రాలు లీకులు మాయం కాకూడదు. అందుకే విద్యను ప్రవేటు మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి  చేసి విద్యను జాతీయం చేయాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి.అని చాటి చెప్పేదే ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ చిత్రం. ఆగస్టు 22 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాము అని అన్నారు.

నటీనటులు - ఆర్. నారాయణ మూర్తి, వైఎస్ కృష్ణేశ్వర్ రావు, తిరుపతి నాయుడు, విజయ్ కుమార్ మరియు నూతన తారాగణం. 

పాటలు - గద్దర్ - జలదంకి సుధాకర్,  - వేల్పుల నారాయణ.-మోటపలుకులు రమేష్,

ఎడిటింగ్ - మాలిక్

కెమెరా - బాబూరావు దాస్

కథ-స్క్రీన్ ప్లే - మాటలు - సంగీతం - దర్శకత్వం - నిర్మాత
ఆర్. నారాయణ మూర్తి