Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Showing posts with label ఎస్. జానకి. Show all posts
Showing posts with label ఎస్. జానకి. Show all posts

Apr 22, 2020

ఎస్. జానకి పాటల్లో


పదహారేళ్ళ వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి.. నేను కవ్విస్తే.. పాటలో పండు ముసలావిడ గొంతు.. గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరం... చిన్నారిపొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు.. శ్రీవారి శోభనం చిత్రంలోని `అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక` పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట పాడి తనది ఎవరూ గెలువలేని ప్రత్యేకత అని నిరూపించుకున్నది, జానకి. జానకి గొంతులో ఎన్నెన్నో భావాలు.. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత.. `ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది` అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమ తత్వం.. వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన.. `తొలిసారి మిమ్మల్ని చూసింది` అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఎన్నటికీ మరచిపోలేని రీతిలో ఉంటాయి. అలనాటి జమున నుంచి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకూ ఐదు తరాల హీరోయిన్లకి ఆలంబన అయింది. తెరముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది. అదీ జానకి ప్రత్యేకత.

వినరా సూరమ్మ కూతురి మొగుడా విషయము చెపుతాను “

“ఎందుకో చేరువై దూరమౌతావు ( నీలి మేఘాలలో)….. ” ,

“నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు (కళ్ళలో ఉన్నదేదో కన్నుల కే తెలుసు )” …,

“పువ్వు రాలిన వేళ కళ్యాణము అందాక ఆరాటం ( మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం ) ” 

“నాకు లేదు మమకారం మనసుపైన అధికారం …ఆశలు బాసిన వేసవిలో (వెన్నెల్లో గోదారి అందం )….
“మము గన్న మా యమ్మ అలివెలు మంగా (నడి రేయి ఏ జాములో )

“అర్జున ఫల్గున పార్ధ కిరీటి బిరుగొన్న విజయ “( నరవరా ఓ కురువరా ) 
వల్లభా ప్రియ వల్లభ లో “బుగ్గలకావిరి తగిలేలా సిగ్గులు ..విరిసేనా ” అంటూ అలలా పైకెగిరే స్థాయి…,
నను నీవు నిను నేను తనివితీరగ తలచుకొని (“కుశలమా ఎచనుంటివో ప్రియతమా ),
విహార వీణలు విందులు కాగా ..తనువు మనసు ఊలీ సోలి….అన్న తీరు (వసంత గాలికి వలపులు రేగ వరించు బాలిక మయూరి కాగా ) , ( డా!! బాల మురళీ కృష్ణ తో హాయి గా సాగిన యుగల గీతము….)
“ఒకసారి కలలోకి రావయ్యా…”అంటూ వేడుకుంటోనట్లు పలికిన తీరు ,
సన్నజాజీ పడకా…మాటవినకుందే ఎందుకే…..అంటూ సాగతీయడం
మదిలోని వాడు గదిలోకి వస్తే ….(మావయ్య వాస్తాడంట ) తుళ్ళుతూ సాగే పాట..
వింతగా కవ్వింత గా అంటూ గిలిగింతలు పెట్టించేది గా …
“పక్కన నువ్వుంటే ప్రతి రాత్రి పున్నమిరా ” అంటూ సిగ్గు పడె నవ్వు వెన్నెల గొప్పించిన రేయి లా ….
“సిరి మల్లే పువ్వల్లే నవ్వు ” లోని నవ్వు సెలయేటి తరగలలాగా కదిలేది గా…
“ నవ్వింది మల్లె చెండు “ లోని నవ్వు పరవళ్ళు తొక్కుతున్న గోదారిలా ..
“రాగమో అనురాగమో “ లోని నవ్వు ఎగిరే కెరటం కొండను ఢీ కొట్టుకునట్లు గా..
“ పరువమా చిలిపి పరుగు తీయకు “ లో నవ్వు తొలకరి ఝల్లులాగా…
“పంత చేల్లో పాలకంకి నవ్వింది “ లో నవ్వు కోనసీమ లోని పచ్చని చేలు లా..
“పూవులు పూయును పదివేలు “ లో నవ్వు కుప్పించిన జాణతనములా ….
“సిగ్గు పూబంతి “ లో నవ్వు సాగరము లో కలిసే కన్నే గోదారిలా గంభీరము గా ఉంటుంది.
ఆవిడ పాడిన ఎన్నో యుగల గీతాలు ప్రజాధరణ పొందాయి.ఆనాటి నుండి ఈ నాటి వరకు యువతరాని వేద మంత్రమయ్యాయి “ఊపిరి తగిలిన వేళ ….”అంటూ వెచ్చగా పలికిన తీరు (“వీణ వేణు వైన )..
అబ్బో నేరేడు పళ్లు లో “అబ్బో ” అన్న తీరు ,
శ్రీవారికి ప్రేమ లేఖ లో “ తొలిసారి మిమల్ని …లో ఎన్నో కలలు కన్న “కన్నె బంగారు “ ఆ మాట వింటే చాలు దేవులపల్లి వారి “ జాబిలి కూన “ గుర్తు రాక మానదు.
“ఎర్రాన్ని కుర్ర దాన్ని గోపాలా ” , “వద్దంటే వినడే పోకిరి ” 
“సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట “( మౌనమేలనోయి ఈ మరపురాని రేయి)
ఇలా ఎన్నో రకాల పాటలలో సరిలేరు ఆమెకెవ్వరూ…

నీలిమేఘాలలో... గాలి కెరటాలలో (బావామరదళ్లు), పగలే వెన్నెల, జగమే ఊయల (పూజాఫలం), నడిరేయి ఏ జాములో (రంగులరాట్నం), ఆడదాని ఓరచూపులో (ఆరాధన), ఈ దుర్యోధన, దుశ్సాసన, దుర్వినీతి లోకంలో (ప్రతిఘటన), గున్న మామిడి కొమ్మ మీద(బాలమిత్రుల కథ), కన్నె పిల్లవని కన్నులున్నవి (ఆకలి రాజ్యం), సిరిమల్లె పువ్వా (సిరిమల్లె పువ్వా), సందె పొద్దుల కాడా (అభిలాష), మౌనవేలనోయి (సాగర సంగమం), గోవుల్