Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Showing posts with label నటించారు.. Show all posts
Showing posts with label నటించారు.. Show all posts

Jul 9, 2020

సరిలేరు నీకెవ్వరు టెలికాస్ట్‌లో 17.4 టిఆర్‌పి

సరిలేరు నీకెవ్వరు టెలికాస్ట్‌లో 17.4 టిఆర్‌పి




సరిలేరు నీకెవ్వరు రెండవ టెలికాస్ట్‌లో 17.4 టిఆర్‌పి.సరిలేరు నీకెవ్వరు 2020 లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రై. లి, ఎ. కే ఎంటర్టైన్మెంట్స్ తరపున దిల్ రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.  2020 జనవరి 11 న సంక్రాంతికి ముందు ఈ చిత్రం విడుదలైంది. కర్నూలు వైద్యకళాశాలలో ప్రొఫెసరుగా పనిచేస్తుంటుంది భారతి. అవతలి వారు ఎంత శక్తివంతులైనా నిజానికి నిర్భయంగా చెప్పగల వ్యక్తి. ఆమె కూతురికి వివాహం నిర్ణయిస్తుంది. ఆమె భర్త, పెద్ద కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించినా ఆమె చిన్న కొడుకు అజయ్ కూడా సైన్యంలో చేరుస్తుంది. మేజర్ అజయ్ కృష్ణ భారత సరిహద్దులో సైన్యంలో మేజర్ గా పనిచేస్తుంటాడు. భారతి కొడుకు అజయ్ తన చెల్లెలు వివాహం కోసం వెళ్ళాలనుకుంటాడు. మధ్యలో ఒకానొక ఉగ్రవాద ఆపరేషన్ కోసం వెళ్ళిన అతను తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిపోతాడు. సైన్యాధికారి మానవతా ధృక్పథంతో అజయ్ కృష్ణను సైన్యం తరఫున భారతి కుటుంబానికి వెళ్ళి సాయం చేయమంటాడు. అతనికి తోడుగా మరో సైనికుడు ప్రసాద్ కూడా వెళతాడు. దారిలో వీరికి సంస్కృతి అనే అల్లరిపిల్ల తారసపడుతుంది.