Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Showing posts with label దాదాసాహెబ్ ఫాల్కే. Show all posts
Showing posts with label దాదాసాహెబ్ ఫాల్కే. Show all posts

Apr 30, 2020

ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సినిమా... దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి...నేడు..

ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సినిమా... దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి...నేడు..
భారతీయ సినిమా పితామహుడు - దాదాసాహెబ్ ఫాల్కే - జయంతి - 30 ఏప్రిల్
ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే
దాదాసాహెబ్ ఫాల్కే
జననం ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే
ఏప్రిల్ 30, 1870
మరణం ఫిబ్రవరి 16, 1944
భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత
“ఒక అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలన చిత్ర రంగం ఆవిష్కారమైనది. వెండి తెరపై భారతీయ దేవుళ్ళను చూడాలనే స్వప్నం కళ్లకెదురుగా కదలాడింది. ఆనాడు బైస్కోపులు అమెరికా, ఇతర నాగరిక పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి అయ్యేవి. చెక్కబొమ్మలు చెక్కేవారు. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, మాజిక్, మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరినవాడై స్వాప్నికుడిగా మారిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగాడు. దాదా సాహెబ్ ఫాల్కేగా గణుతికెక్కాడు ”
ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే (ఏప్రిల్ 30, 1870 - ఫిబ్రవరి 16, 1944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి. ఇతడి ప్రథమ సినిమా రాజా హరిశ్చంద్ర (భారతీయ మొదటి సినిమా) 1913. ఇతడు తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్మ్ లు, నిర్మించాడు.