Nov 11, 2025

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ‘పిఠాపురంలో’ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ















 

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ‘పిఠాపురంలో’ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

 

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా

 ‘పిఠాపురంలో’ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ



‘ప్రేయసి రావే’ ఫేమ్‌ మహేష్‌చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉపశీర్షిక ‘అలా మొదలైంది’. డా. రాజేంద్రప్రసాద్‌, పృధ్వీరాజ్‌, కేదార్‌ శంకర్‌,మణిచందన, సన్నీ అఖిల్, విరాట్‌, సాయిప్రణీత్ , శ్రీలు, ప్రత్యూష తదితరులు  ఈ చిత్ర ప్రధాన తారాగణం. మహేష్‌చంద్ర సినిమా టీమ్‌ పతాకంపై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్‌ పటేల్‌, ఎఫ్‌ఎం మురళి (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కాన్సెప్ట్‌ గురించి దర్శకులు చెప్పారు. మంచి సందేశాత్మక చిత్రంగా అనిపిస్తోంది. యువతరం కుటుంబ సమేతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఎదగాలనే సందేశం ఈ సినిమాలో ఉంది. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి’’ అని చెప్పారు.


డా. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఇవాళ సమాజంలో ఏం జరుగుతుందనే పాయింట్‌ని దర్శకుడు మహేష్‌చంద్ర అద్భుతంగా డీల్‌ చేశాడు. స్టోరీ నచ్చి నేను కూడా ఇష్టంగా ఈ సినిమా చేశాను. ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’, ‘ఓనమాలు’ తరహాలోనే సందేశాన్ని అందిస్తూనే యువతరాన్ని ఆకట్టుకునే అంశాలున్న సినిమా ఇది’’ అని తెలిపారు.


నటుడు పృధ్వీరాజ్‌ మాట్లాడుతూ ‘‘ఇది మూడు కుటుంబాల కథ. ఈ ఇంటర్‌నెట్‌ యుగంలో తల్లిదండ్రులంటే గౌరవం కనబరచని యువతకు కనువిప్పు కలిగించే చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు.

దర్శకుడు మహేష్‌చంద్ర మాట్లాడుతూ ‘‘నా తొలి సినిమా ‘ప్రేయసి రావే’ నాకెంతో గొప్ప పేరు తీసుకొచ్చింది. ఈరోజుకీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయి ఉంది. ‘పిఠాపురంలో’ సినిమా కూడా అదే స్ధాయిలో నిలిచిపోయే సినిమా. నా మనసుకి నచ్చిన కథ ఇది. ముగ్గురు తండ్రుల కథలా అనిపిస్తూనే మూడు జంటల మధ్య నడిచే కథ ఇది. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ గారి నియోజకవర్గమైన ‘పిఠాపురం’ పేరుతోనే ఈ సినిమా తీశాం. ఈ టైటిల్‌ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగారు ఆవిష్కరించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో ఉంది. వచ్చే నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం” అని తెలిపారు.

డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, రాజ్ కుమార్ వడయారు,  మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K A పాల్ రాము, జబర్దస్త్ శేషు ఇందులో ప్రధాన తారాగణం. 

ఈ చిత్రానికి కథ: ఆకుల సురేష్ పటేల్, స్టోరీ డెవలప్మెంట్ & డైలాగ్స్ : శ్రీరామ్ ఏదోటి, ఎడిటర్: B. సత్యనారాయణ, మ్యూజిక్ : G.C క్రిష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అంజి సండ్రాల, నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, FM మురళీ (గోదారి కిట్టయ్య), స్క్రీన్ ప్లే- డైరెక్షన్: మహేష్ చంద్ర .

tollywood30


via https://www.youtube.com/watch?v=XPzIZUBhZDI

tollywood114


via https://www.youtube.com/watch?v=3PLQ9EgY35w