17 సంవత్సరాల జానీ



జాని పవన్ కళ్యాణ్ స్వీయ కథాకథనదర్శకత్వంలో రూపొందించబడ్డ తెలుగు చలన చిత్రం. ఈ చిత్రం పై పవన్ కళ్యాణ్ చేసినన్ని ప్రయోగాలు బహుశ భారతదేశంలో ఏ దర్శకుడూ చేసి ఉండరు 
లైవ్ రికార్డింగ్  సాధారణంగా చిత్రాలు షూటింగ్ అయిన తర్వాత డైలాగులను రికార్డు చేస్తారు. కానీ ఈ చిత్రానికి డైలాగులను అక్కడికక్కడే రికార్డు చేసారు.చిట్టి చెల్లెలు చిత్రంలోని ఈ రేయి తీయనిది గీతాన్ని రీ-మిక్స్ చేశారురావోయి మా ఇంటికి పాటని రావోయి మా కంట్రీకి అని చమత్కరించాడు. ఈ పాట స్వయంగా పవనే ఆలపించటం విశేషం.

చిన్ననాటనే తల్లిని కోల్పోయిన జానీ (పవన్ కళ్యాణ్) ను అతని తండ్రి (రఘువరన్) కూడా పెద్దగా పట్టించుకోడు. పైగా సిగరెట్లు ఎక్కువ కాలుస్తూ ఉండటం, మద్యం ఎక్కువ సేవిస్తున్న తండ్రిని భరించలేక జానీ ఇంటి నుండి పారిపోతాడు. పెరిగి పెద్దవాడైన జానీ మార్షల్ ఆర్ట్స్ కోచ్ అవుతాడు. జానీ ఒకరిని దేహశుద్ధి చేయటం చూచిన గీత (రేణు దేశాయ్) అతనిపై పోలీసులకి ఫిర్యాదు చేస్తుంది. అది అపార్థమని తెలుసుకొన్న గీత అతనిని క్షమాపణలు కోరుతుంది. ఇరువురి మధ్య సఖ్యత నెలకొని ప్రేమ, పెళ్ళి ల వరకు దారితీస్తుంది. వివాహానంతరం గీతకు క్యాన్సర్ సోకుతుంది. స్నేహితుల వద్ద నుండి సేకరించిన కొంత మొత్తం డబ్బుతో జానీ గీత వైద్యం కొరకు ముంబై వెళతాడు.ముంబయిలో ప్రతి రోజు బాక్సింగ్ ఫైట్ లు జరుగుతాయని, జానీకి తెలిసిననూ, తొలుత వద్దనుకొంటాడు. కానీ గీత పరిస్థితి నానాటికి విషమించి, ఒకే రోజులో రెండు లక్షల రూపాయలు అవసరం అవుతాయి. దీనితో జానీ ఒప్పుకొంటాడు. జానీ గీతను బ్రతికించుకొన్నాడా, లేదా అన్నదే తర్వాతి కథ.

సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ఇందులోని సాంకేతిక విలువలను అభినందించలేక పోయాడు. బాక్స్ ఆఫీసు వద్ద విజయానికి నోచుకోలేకపోయినా "జానీ" సినీ విమర్శకుల అభిమానాన్ని చూరగొంది. క్యాన్సర్ బారిన పడ్డ భార్యని రక్షించుకోవటానికి పడ్డ కష్టాలకి జానీ చాలా మంది మహిళా ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు.

Post a Comment

0 Comments