త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు

పదునైన సంభాషణలకి త్రివిక్రం పెట్టింది పేరు. ఏ రసమైనా, సంభాషణ క్లుప్తంగా, ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటుంది. అతని కలంలో నుండి వెండితెరపైకి జాలువారిన కొన్ని 
త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు:


నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం
గుద్దితే మొహం చట్నీ అయిపోతుంది.

నువ్వు నాకు నచ్చావ్

వెంకీ: నా ప్రార్థన మీకు కొంచెం కొత్తగా అనిపించొచ్చు......
ఎం. ఎస్. నారాయణ: కొత్తగా కాదు .... చాలా చెత్తగా వినిపించింది.....
వెంకీ: మీరేం చేస్తుంటారు?
ఎం. ఎస్: ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాను. తొందరపడి ఏదో ఒకటి చేయటం నాకిష్టం ఉండదు.

బాధలో ఉన్న వాడిని బావున్నావా అని అడగటం అవివేకం... బాగున్నవాడిని ఎలా ఉన్నావ్ అని అడగటం అనవసరం..

జులాయి

భయపడటం లోనే పడటం ఉంది మనం పడద్దు లెగుద్దాం
ఆశ కాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది భయం అల్సెర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది
నీకే తల నొప్పి తెస్తున్నాడంటే వాడెవడో అమృతాంజన్ కు అమ్మ మొగుడై ఉంటాడు.

అ ఆ

రామలింగం: మీ అమ్మ తనకు గుర్తుంది మాత్రమే చెప్పింది. మీ అమ్మే కాదు, మనుషులంతా అంతే. లేకపోతే బ్రతకలేరు కదా!
ఆనంద్: మీ అమ్మ తనకు గుర్తుంది చెప్పింది. మీ నాన్న తనకు తెలిసింది చెప్పాడు. కానీ నేను, జరిగింది చెప్పాను. జరిగిందంతా గుర్తుపెట్టుకోవలసింది నేనే!



Post a Comment

0 Comments