మన అపూర్వ కళాకారులు
కొంత విరామంతో కొనసాగుతున్న ఈ ప్రస్తుత లాక్‌డౌన్ పరిణామం నాలో కలిగించిన ఒక ఉద్వేగభరిత భావంతో మన తెలుగు నటీమణుల, నటప్రవీణుల విద్వత్తు, ప్రతిభల సమున్నతను స్మరిస్తున్న సందర్భం ఇది. అత్యున్నత స్థాయికి చెందిన మన తెలుగు చిత్రాలను ఇంతకుముందు ఎన్నో పర్యాయాలు చూసినప్పటికీ ఇప్పుడు మరోసారి చూసే అవకాశం లభించింది.
భానుమతిగారితో ఆరంభమై.... కన్నాంబ, అంజలీదేవి, సావిత్రి, జమున, సరోజాదేవి, ఎల్ విజయలక్ష్మి, కృష్ణకుమారి, సూర్యకాంతం, నిర్మలమ్మ, శారద, వాణిశ్రీ, రమాప్రభ, జయసుధ, జయప్రద, శ్రీదేవి గార్ల వంటి అందరూ...
ఎస్వీ రంగారావుగారి నుండి రేలంగి, రమణారెడ్డి, అల్లురామలింగయ్య, ధూళిపాళ, గుమ్మడి, నాగభూషణం, పద్మనాభం, రాజబాబు, సత్యనారాయణ, రావుగోపాలరావు కోట గార్ల వరకూ... ఇంకెందరో, ఎందరో, మన తెలుగు సినిమాను ప్రేక్షకుల కన్నులపంటగా తీర్చిదిద్దిన వరాల నటనా విశారదులు...
తెలుగు సినిమా ప్రారంభం నుండి, నేటి వరకూ ప్రజాభిమానం పొందిన హీరో పాత్రధారులు, స్టార్లు, సూపర్‌స్టార్లందరికీ సముచిత గౌరవాన్ని ఇస్తూ, పైన చెప్పిన వారందరినీ ఒకసారి, మరొక్కసారి గుర్తు చేసుకోగలిగిన జీవనగమన సంప్రాప్తత ఈ సమయం అని అభిప్రాయపడుతున్నాను.
విజయశాంతి
మూవీ ఆర్టిస్ట్
0 Comments