భారతదేశపు మొట్టమొదటి పూర్తి నిడివి గల చిత్రం రాజా హరిశ్చంద్రకు 107 సంవత్సరాలు

 భారతదేశపు మొట్టమొదటి పూర్తి నిడివి గల చిత్రం  రాజా హరిశ్చంద్రకు 107 సంవత్సరాలు
ఫాల్కే, రాజా రవివర్మ చిత్రాలచే ప్రభావితుడై నిర్మించిన సినిమా. ఇందులో పనిచేసినవాళ్ళంతా పురుషులే. స్త్రీపాత్రలకు కూడా పురుషులే పోషించారు.


సత్యసంధుడైన హరిశ్చంద్రుడి చుట్టూ తిరిగే ఈ కథ, తన రాజ్యం, తన కుటుంబం పోగొట్టుకొని, విశ్వామిత్రుడికిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, హరిశ్చంద్రుడు పడే తపన, యాతన వర్ణించే చిత్రం.

ఈ సినిమా మొదటిసారిగా 1913, మే 3న ప్రజలకొరకు ప్రదర్శించారు. బాంబే, గిర్‌గావ్ లోని కొరోనేషన్ సినిమా దీనికి వేదిక. హాలు బయట ప్రజలంతా బారులు తీరి నిలబడ్డారు. భారత్ లో నిర్మించిన మొదటి సినిమా కాబట్టి ప్రేక్షకులకు ఇదో వింత అనుభూతి. ఈ సినిమా హిట్టయింది. ప్రజాదరణనూ పొందింది. ఈ సినిమాను గ్రామీణ ప్రాంతాలలోనూ ప్రదర్శించడానికి ఫాల్కే ఏర్పాట్లు చేసాడు



Post a Comment

0 Comments