మదర్ ఇండియా

మదర్ ఇండియా 

1957 బాలీవుడ్ సినిమా, మహబూబ్ ఖాన్ చే దర్శకత్వం వహించబడినది. దీనిలో నటీనటులు నర్గిస్ దత్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్. ఈ సినిమా 1958 లో అకాడమీ అవార్డు, ఉత్తమ విదేశీ భాషా చిత్రం కొరకు నామినేట్ చేయబడినది.

మహబూబ్ ఖాన్ 1940లో ఔరత్ (స్త్రీ) అనే చిత్రం నిర్మించాడు, దాని ఆధారంగానే 1957లో 'మదర్ ఇండియా' అనే ఈ చిత్రం నిర్మించాడు 

భారతదేశపు గ్రామ పరిసరాలను ప్రతిబింబించే చిత్రం. ఇందులో భారతీయ సగటు స్త్రీ, తన కుటుంబంకోసం, తన పిల్లలకోసం పడే పాట్లను చక్కగా చిత్రీకరించడమైనది.

రాధా (నర్గిస్) శ్యాము (రాజ్ కుమార్) నవీన దంపతులు, వీరి వివాహం కొరకు రాధ అత్త, ఓ వడ్డీవ్యాపారి 'సుఖీలాల్' వద్ద 500 రూ. అప్పు తీసుకుంటుంది. ఆ అప్పును తీర్చమని సుఖీలాల్ బలవంతం చేస్తూ పంచాయితీ పెడతాడు. పంచాయితీ వడ్డీవ్యాపారి పక్షానే తీర్పు ఇస్తుంది. అప్పు తీర్చేందుకు శ్యాము, రాధ, తమ పొలంలో పండే పంటలో మూడు వంతులు వడ్డీ రూపేణా ఇవ్వాలని తీర్మానం జరుగుతుంది.

పేదరికం, పంటలు సరిగా పండక పోవడం, గ్రామసీమలోని పేదరికాన్ని, వడ్డీవ్యాపారస్తుల మానవతావిహీనత్వాన్ని, పంచాయతీల కఠోరత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అప్పుతీర్చలేని శ్యామూను చూసి అందరూ అవహేళణ చేస్తారు, ఈ అవహేళణను భరించలేక శ్యాము ఊరు విడిచి వెళ్ళిపోతాడు. శ్యాము తల్లి మరణిస్తుంది. రాధ తన ఇద్దరు బిడ్డలతో పస్తులతో కఠోర జీవితాన్ని అనుభవిస్తుంది. సుఖీలాల్ రాధను వివాహమాడమని కోరతాడు, రాధ తనను 'అమ్ముకోన'ని నిరాకరిస్తుంది. ఈ విపత్తులోనే, ఇంకో విపత్తు దాపురిస్తుంది. తుఫాను భీబత్సాన్ని సృష్టిస్తుంది, ఈ విపత్తులో గ్రామవాసులంతా వలస వెళతారు. కాని రాధ అభ్యర్థనపై గ్రామ పునర్నిర్మాణానికి పూనుకుంటారు.

రాధ తనతో మిగిలిన ఇద్దరు కుమారులు బిర్జూ(సునీల్ దత్), రాము ( రాజేంద్ర కుమార్ ) తో జీవనం సాగిస్తుంది. కుమారులు యౌవనులవుతారు, కథ అనేక మలుపులు తిరుగుతుంది. రాము ఓ ఇంటి వాడవుతాడు, బిర్జూ సుఖీలాల్ పట్ల విద్వేషి అవుతాడు. సుఖీలాల్ కుమార్తె వివాహం రోజున బిర్జూ సుఖీలాల్ ను చంపుతాడు, పెళ్ళికుమార్తెను బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించినపుడు, సగటు భారతనారియైన రాధ, బిర్జూ విఘాతానికి వ్యతిరేకియై, బిర్జూని కాల్చి చంపుతుంది. ఆవిధంగా ఓ పెండ్లికుమార్తె జీవితాన్ని కాపాడి మానవత్వాన్ని సగర్వంగా ప్రకటిస్తుంది.


Post a Comment

0 Comments