సినిమా ప్రొడ్యూసర్లు, సినిమా ప్రదర్శకులు, చిత్రరంగ ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన కేంద్ర సమాచార ప్రసార శాఖమంత్రి శ్రీ ప్రకాష్ జవడేకర్
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవడేకర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, సినిమా ప్రదర్శకులు , చిత్ర పరిశ్రమ ప్రతినిధులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారి నుంచి అందిన పలు విజ్ఞాపనల దృష్ట్యా ఈ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకాష్ జవడేకర్, మన దేశంలో 9,500 స్క్రీన్లు ఉన్నాయని , ఒక్క సినిమాహాళ్ళే, రోజూ టిక్కెట్ల అమ్మకం ద్వారా 30 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయని తెలిపారు. చిత్రపరిశ్ర మ వర్గాల ప్రత్యేక డిమాండ్ల పై చర్చిస్తూ, మంత్రి పరిశ్రమ వర్గాలు కోరిన సహాయం చాలావరకు ఆర్ధిక సహాయం రూపంలో ఉందన్నారు. అంటే జీతభత్యాల సబ్సిడీ, మూడేళ్లపాటు వడ్డీలేనిరుణాలు, పన్నులు, సుంకాలనుంచి మినహాయింపు, విద్యుత్‌పై కనీస డిమాండ్ చార్జీల రద్దు, పారిశ్రామిక రేట్లలో విద్యుత్ సరఫరా అంశాలవంటివి ఉన్నాయి.ఇందుకు సంబంధించిన అంశాలను తగిన చర్యల నిమిత్తం సంబంధిత మంత్రిత్వశాఖల దృష్టికి తీసుకుపోనున్నట్టు మంత్రి వారికి తెలిపారు.
ప్రోడక్షన్ సంబంధిత కార్యకలాపాల పునఃప్రారంభం గురించి ప్రస్తావిస్తూ మంత్రి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్లను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించాలన్న డిమాండ్‌పై మాట్లాడుతూ, జూన్ నెలలో కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితిని గమనించిన మీదట ఈ అంశాన్ని పరిశీలించనున్నట్టు ఆయన వారికి చెప్పారు.

0 Comments