దక్షిణ ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది : డైరెక్టర్ బుచ్చి బాబు








దక్షిణ ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది : డైరెక్టర్ బుచ్చి బాబు

మంత్ర, మంగళ సినిమాలతో తెలుగు చలన చిత్ర రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఒక ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ మళ్ళీ "దక్షిణ" మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కల్ట్ కాన్సెప్ట్స్ మూవీ బ్యానర్ లో నిర్మాణం చేస్తున్న ఈ చిత్రానికి అశోక్ షిండే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. "కబాలి" ఫేమ్ సాయి ధన్షిక కథానాయికగా నటిస్తుండగా, "మహాభారత్ మర్డర్స్" ఫేమ్ రిషవ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర గ్లిమ్స్ కు విశేష స్పందన లభించింది. తాజాగా, ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ... "ఈ మధ్య కాలంలో నన్ను బయపెట్టిన ట్రైలర్ ఇదే. మళ్ళీ తులసి రామ్ గారు టాలీవుడ్ కి మరో ట్రెండ్ సెట్టర్ సైకో థ్రిల్లర్ ని దక్షిణ సినిమాతో ఇవ్వబోతున్నారు" అంటూ అభినందించారు.

ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు చిత్ర బృందం పాల్గొంది. దక్షిణ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాత అశోక్ షిండే తెలిపారు.

ట్రైలర్ లింక్: https://youtu.be/rIn_PQ7dtZE?si=k8Om7a4lHB0v6I7Z

ఈ చిత్రం గురించి మీ అభిప్రాయం ఏమిటి?



Post a Comment

0 Comments