Full width home advertisement

Post Page Advertisement [Top]

ఉస్తాద్ రామ్ పోతినేని, సంజయ్ దత్, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ క్రేజీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్' ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15న థియేట్రికల్ రిలీజ్




ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ మ్యాసీవ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌తో తిరిగి వస్తున్నారు. మేకర్స్ ఈరోజు సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు. డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.  

సినిమా విడుదలకు  ఇండిపెండెన్స్ డే పెర్ఫెక్ట్ టైమ్. గురువారం సెలవు కాగా, సోమవారం (రక్షాబంధన్) మరో హాలీ డే కూడా సినిమాకు కలిసిరానుంది. పవర్ ఫుల్ రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ పవర్-ప్యాక్డ్ అవతార్‌లో విభూతి ధరించి కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో ఒక శివలింగం, కాగడ ని చూడవచ్చు.

ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లతో ముందుకు వస్తారు.

యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ప్రీక్వెల్‌కి డబుల్ ఇస్మార్ట్ సినిమా డబుల్ మ్యాడ్ నెస్ తో ఉండబోతుంది. పూరి జగన్నాధ్ మరోసారి తన హీరోని బెస్ట్  స్టైలిష్, మాస్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు.

రామ్ డబుల్ ఇస్మార్ట్‌ని డబుల్ స్కిల్స్ తో అదరగొట్టారు. సంజయ్ దత్ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్.

మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రాఫర్‌లు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

| Designed by Colorlib