Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Sep 13, 2024

సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధమైన "మన్యం ధీరుడు"



సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధమైన "మన్యం ధీరుడు"

ఆర్ వి వి మూవీస్ పతాకంపై  శ్రీమతి ఆర్ పార్వతీదేవి సమర్పణలో నరేష్ డెక్కల దర్శకత్వంలో ఆర్ వి వి సత్యనారాయణ నటించి, నిర్మించిన చిత్రం " మన్యం ధీరుడు". ఆర్ వి వి సత్యనారాయణ అల్లూరి సీతారామరాజు  పాత్రలో అత్యంత అద్భుతంగా నటన ప్రదర్శించినటువంటి ఈ చిత్రం సెప్టెంబర్ 20వ తేదీన విడుదలకు సిద్ధమైంది. అరుకు, పాడేరు, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ప్రదేశాలలో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుంది. 

అల్లూరి సీతారామరాజు నిజ రూప చరిత్రను వెండి తెరపై అవిష్కరించడానికి నటులు ఆర్ వి వి సత్యనారాయణ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విల్లు విద్యలో శిక్షణ తీసుకున్నారు. మన్యం ధీరుడు చిత్రంలో యదార్ధ సన్నివేశాలు, యదార్ధ సంఘటనలు ప్రజలకి అందించాలనే సంకల్పంతో ఆర్ వి వి సత్యనారాయణ  ఈ చిత్రాన్ని నిర్మించారు. బానిస సంకెళ్ళు తెంచుకుని  బ్రిటీష్ తెల్ల దొరల పాలనకు చరమగీతం పాడే సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. 
ఈ చిత్రం కోసం భారీ ఖర్చుతో ఒక ఊరినే నిర్మించి అక్కడ షూట్ చేయడానికి సాహసోపేత మైనటువంటి సన్నివేశాలు ఎన్నో మన కళ్ళకు కట్టినట్టు చూపించే చిత్రం మన్యం ధీరుడు . ఈ చిత్రానికి సంగీతం పవన్ కుమార్, కెమెరా వినీత్ ఆర్య మరియు ఫరూక్ , ఎడిటర్ శ్యాం కుమార్.

No comments:

Post a Comment