సినిమా సినిమా

test

🔥 Today's Best Offers

Post Page Advertisement [Top]



సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత స్వాతిసుధీర్ నిర్మిస్తున్న సినిమా రామ్ భజరంగ్. రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న రామ్ భజరంగ్ సినిమాకు సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. 

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యింది, దసరా సందర్భంగా రామ్ భజరంగ్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా మాసీగా ఉందని, ఇద్దరు హీరోలు రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ చాలా డిఫరెంట్ లుక్స్ , గెటప్స్ లో ఉన్నారని పాజిటీవ్ కామెంట్స్ వస్తున్నాయి. 

గదర్ 2 హీరోయిన్ సిమ్రత్ కౌర్, బిచ్చగాడు ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ చాలా డిఫరెంట్ లుక్స్ లో ఈ మూవీలో కనిపించబోతున్నారు. 1980 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. 2025 లో ఐదు భాషల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ)  ఈ సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.


No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

| Designed by Colorlib