Full width home advertisement

Post Page Advertisement [Top]


 "చెన్నై లవ్ స్టోరీ" టైటిల్, గ్లింప్స్ రిలీజ్

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, యంగ్  టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీకి "చెన్నై లవ్ స్టోరీ" టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సాయి రాజేశ్, ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. 

తొలి ప్రేమేం తోపు కాదు, ఫస్ట్ లవ్ ఫెయిలైతే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలువుతుందని చెబుతూ సాగిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ లో హీరో కిరణ్ అబ్బవరం ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్నారు. శ్రీ గౌరి ప్రియ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంప్రెస్ చేసింది. సముద్రపు ఒడ్డున ఈ జంట ఫస్ట్ లవ్, బెస్ట్ లవ్ గురించి మాట్లాడుకున్న సంభాషణ ఆసక్తికరంగా, ఆలోచింపజేసేలా సాగింది. 'తొలి ప్రేమకు మరణం లేదు' అనే "బేబి" సినిమాలోని ఫేమస్ డైలాగ్ ను హీరోయిన్ చెబుతూ తొలిప్రేమే గొప్పదని అంటుంది. అందుకు హీరో స్పందిస్తూ  'తొలి ప్రేమేం తోపు కాదు, ఫస్ట్ లవ్ ఫెయిలైతే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలువుతుంది..' అని సమాధానం చెబుతాడు. అంతం వరకు అనంతమై సాగే ఈ జీవితంలో తొలి ప్రేమ ఒక మజిలీ మాత్రమేనని, అదే తుది కాదనే కాన్సెప్ట్ ను ఈ గ్లింప్స్ ద్వారా మేకర్స్ అందంగా తెలియజేశారు. ఈ గ్లింప్స్ కు 'తొలి ప్రేమే తోపు కాదే తోపు కాదే..' అంటూ మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యూటిఫుల్ బీజీఎం సాంగ్ కంపోజ్ చేశారు.

నటీనటులు - కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ - దేవి పర్చూరి
ఆర్ట్ - భాస్కర్ ముదావత్
ఎడిటర్ - సంతోష్ నాయుడు
డీవోపీ - విశ్వాస్ డేనియల్
లిరిక్స్ - అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ - మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్), వంశీ కాకా
మార్కెటింగ్ - హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ - ధీరజ్ మొగిలినేని
ఇన్వెస్టర్స్ - రమేష్ పెద్దింటి, శేఖర్ బాలబొమ్మ
స్టోరీ - సాయి రాజేశ్
నిర్మాతలు - సాయి రాజేశ్, ఎస్ కేఎన్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - రవి నంబూరి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

| Designed by Colorlib